శర్వా ఇకనైనా మేలుకో.. రూటు మార్చకపోతే అంతే.!!

P.Nishanth Kumar
కొంతమంది హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఎంత ట్రై చేసినా కూడా విజయం మాత్రం వారికి దక్కదు. అలాంటి హీరోలలో శర్వానంద్ ఒకరు. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఈ హీరో కు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. భారీ స్థాయిలో ప్రేక్షకులను అలరించే విధమైన సినిమాలను చేస్తూ వచ్చాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా పరిశ్రమకు వచ్చి ఇంతటి స్థాయి హీరోగా నిలదొక్కుకోవడం అంటే నిజంగా అందరూ గర్వించదగ్గ విషయమే. ఈ నేపథ్యంలో శర్వానంద్ మొదట్లో మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించిన కూడా ఇటీవల కాలంలో ఆయనకు విజయం దక్కడం అనేది గగనం అయిపోయింది.

 ఎన్నో ఆశలు పెట్టుకుని ఇటీవలే విడుదల చేసిన ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా కూడా ఆయనకు విజయాన్ని తెచ్చి పెట్టలేకపోయింది. దాంతో శర్వానంద్ ఇప్పుడు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 4వ తేదీన విడుదల కాగా పట్టుకొని వారం రోజులు కాకముందే ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకో లేక వెళ్ళిపోయింది. దాంతో ఎన్నో ఆశలు పెట్టుకున్న శర్వానంద్ ను ఈ సినిమా కూడా నిరాశ పరిచింది. ఈ విధంగా ఇప్పుడు ఆయనకు హిట్ కావలసిన అవసరం ఏర్పడింది. 

రకరకాల జోనర్ లలో సినిమాలు చేసినా కూడా ఈ హీరోకు ఏ మాత్రం కలిసి రావటం లేదు. ఇక ఇప్పుడు ఆయన ఆశలన్నీ కూడా ఓకే ఒక సినిమా పైన ఉన్నాయి. టైం ట్రావెలింగ్ కాన్సెప్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ఒకే ఒక జీవితం ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. తొందర్లోనే ఈ చిత్రం విడుదల కాబోతుంది. తప్పకుండా హిట్  లేకపోతే మాత్రం ఆయన కెరీర్ ప్రమాదంలో పడుతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే శర్వానంద్ కెరీర్ ప్రమాదం లోనే ఉంది ఆయన హీరోగా చేసిన వరుసగా సినిమాలు ఫ్లాప్  అవుతున్నాయి అంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ఒకే ఒక జీవితం సినిమా ఆయన జీవితాన్ని మార్చేస్తుందా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: