పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్న క్రేజ్ సంగతి అందరికీ తెలిసిందే. కోట్లాది మంది అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయనకు ఉంటారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వెళ్లడం ఆయన అభిమానులకు ఏమాత్రం కూడా ఇష్టం లేదు కానీ ప్రజలకు నిస్వార్థమైన సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైన నిర్ణయం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తొలి సారి ఎన్నికలలో దారుణమైన ఓటమిపాలైన పవన్ కళ్యాణ్ పట్టువదలని విక్రమార్కుడిలా రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నాడు.
వచ్చే ఎన్నికలకు కొన్ని సంవత్సరాల వ్యవధి ఉండడంతో మళ్లీ నటించడానికి ఆయన ముందుకు పోతున్నాడు. ఆ విధంగా ఇప్పటి వరకు రెండు సినిమాలను విడుదల చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరిన్ని సినిమాలు చేయడానికి సిద్ధం అవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ వల్ల ఆయన దర్శకులు ఇబ్బంది పడుతున్నారు అనే వార్త బయటకు వస్తుంది. ఇప్పుడు చెప్పబోయే విషయమే దీనికి ఒక ఉదాహరణ. పవన్ కళ్యాణ్ నిర్ణయం వల్ల దర్శకుడు కృష్ చాలా ఇబ్బంది పడ్డాడు.
అదేమిటంటే ఇటీవల విడుదల చేసిన భీమ్లా నాయక్ సినిమా కోసం క్రిష్ హరిహర వీరమల్లు సినిమా చేయకుండా ఆపారు. ఇది ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా భీమ్లా నాయక్ సినిమా విడుదలైంది. దాంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం గా జరుపుకుంటోంది. దీనివల్ల చాలా సమయం కోల్పోయాడు క్రిష్. ఇక ఇప్పుడు మరో రీమేక్ చేయాలని భావిస్తున్న పవన్ కళ్యాణ్ దానికోసం హరీష్ శంకర్ ను బలి తీసుకోబోతున్నాడు. ఆయన దర్శకత్వంలోని సినిమా మరి కొన్ని రోజులు పోస్ట్‌పోన్ కాబోతుందట. భవదీయుడు భగత్ సింగ్ సినిమా అనౌన్స్ మెంట్ అయ్యి చాలా రోజులు అయిపోయిన నేపద్యంలో ఈ ఈ దర్శకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా ఒప్పుకోవడం వల్ల మరికొన్ని రోజులు ఈ చిత్రం పోస్ట్ పోన్ అయ్యే విధంగా సూచనలు కనిపిస్తున్నాయి. మరి హరీష్ శంకర్ దీని పట్ల ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.