మామ ఎక్ పెగ్ లా.. సినిమా రిలీజ్ రెడీ?
భార్గవ్ వర్మ, అరవింద ప్రకాష్, రాజేష్ రెడ్డి, రవికుమార్, మాధురి కీలక పాత్రధారులుగా ఇక ఈ సినిమాలో నటించినట్లు తెలుస్తుంది. లివిత యూనివర్సల్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మామ ఏక్ పెగ్ లా అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.. సంతోష్ మనోహర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే కమలతో నా ప్రయాణం లాంటి సినిమాను నిర్మించిన సునీల్ రెడ్డి ఇక ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఇప్పటికే శరవేగంగా జరిగిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది అన్నది తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో పోస్టు ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కాబోతున్నాయ్ అని చిత్రబృందం చెబుతోంది.
యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాగా మామ ఏక్ పెగ్ లా సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చిత్రబృందం చెబుతుంది. ఇక ఇటీవల విడుదల చేసిన మామ ఆల్కహాల్ అనే ఆంథం సాంగ్ కి మంచి స్పందన కూడా వస్తుంది. మాస్ యాంగిల్ లో సాగే ఈ పాటను ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తు ఉండడం గమనార్హం. ఇక ప్రేక్షకులందరినీ తన గాత్రంతో ఉర్రూతలూగించే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకు తన గాత్రాన్ని జోడించాడు. సామ్యూల్ బేబీ సంగీతం అందించారు.ఇక ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు ఎంతో వేగంగా జరుగుతున్నాయి అని ఇక త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత సునీల్ రెడ్డి ఇసనాక చెప్పుకొచ్చారు..