రాథే శ్యామ్ ను కలవరపెడుతున్న ఓటీటీ జాతర !

Seetha Sailaja
 కరోనా వేవ్ లు ప్రారంభం అయిన తరువాత ధియేటర్లు మూత పడటం ఆతరువాత ధియేటర్లు తెరుచుకున్నా జనంలో విపరీతమైన భయాలు పెరిగిపోవడంతో ఓటీటీ సినిమాల మ్యానియా ప్రేక్షకులలో విపరీతంగా పెరిగిపోయింది. కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ దేశంలో బిలియనీర్ల సంఖ్య ఎలా పెరిగిపోయిందో ఈ గ్యాప్ లో ఓటీటీ సంస్థల సభ్యత్వాలు కూడ లక్షల సంఖ్యంలో పెరిగిపోవడంతో ఆ సంస్థలకు విపరీతమైన లాభాలు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో అనేక ప్రముఖ ఓటీటీ సంస్థలు తమ స్పీడ్ పెంచి ప్రతి వారం అనేక ప్రముఖ సినిమాలు స్ట్రీమ్ చేస్తున్నాయి. దీనితో ఈ ఓటీటీ సినిమాల పోటీ తట్టుకుని ధియేటర్లలో విడుదల అవుతున్న సినిమాలు నిలబడటం కష్టంగా మారింది. ‘భీమ్లా నాయక్’ లాంటి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూవీ రెండవ వారం నుండి కలక్షన్స్ తగ్గిపోవడం ఇండస్ట్రీ ప్రముఖులకు కూడ అంతుపట్టని విషయంగా మారింది.

రాబోయే రెండు వారాలలో స్ట్రీమ్ కాబోతున్న సినిమాల విషయానికి వస్తే దుల్కర్ సల్మాన్ నటించిన ‘సెల్యూట్’ సినిమా ఈ సినిమా ను సోనీ లివ్ సంస్థ డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తోంది. ఈసినిమా కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు ఇతర సౌత్ భాషల్లో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా సోనీలివ్ ప్రకటించింది. ‘సెల్యూట్’ మూవీ కాకుండా మాస్ మహారాజ రవితేజ ‘ఖిలాడి’ సినిమాను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ చేస్తున్నారు.

మార్చి 11వ తారీకు నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇక ధనుష్ నటించిన ‘మారన్’ సినిమా ను కూడా ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం చేశారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈమూవీ మార్చి 11వ తారీకు నుండి స్ట్రీమ్ కాబోతోంది. అంతేకాదు ఆది పినిశెట్టి హీరోగా నటించిన ‘క్లాప్’ సినిమా ను ఈనెల 11న సోనీ లివ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇలా అనేక సినిమాలు ఓటీటీలో ఈ రెండు వారాలలో స్ట్రీమ్ కాబోతున్న పరిస్థితులలో సగటు ప్రేక్షకుడు టివీ లను వదిలి ‘రాథే శ్యామ్’ వైపుకు అడుగులు పడాలి అంటే ఆమూవీకి టోటల్ పాజిటివ్ టాక్ పై ఆధారపడి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: