షాక్: ఆ హీరోలు అడ్డుపడడంతో కీర్తి సురేష్ సినిమా వాయిదా..?

Divya
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది.. ఈమె మహానటి సినిమా తో తను ఊహించనివిధంగా పాపులారిటీని సంపాదించుకుంది. ఇక ఆ తరువాత ఎన్నో సినిమాలు చేసినప్పటికీ అంతగా కలిసి రాలేక పోయాయని చెప్పవచ్చు. ఈమె ఏ భాషలో తీసిన ఆ సినిమాలన్నీ ఫ్లాప్ లిస్టులోనే చేరిపోతున్నాయి. అయితే ఇప్పుడు తను నటిస్తున్న సాని కాయిధం చిత్రం OTT లో విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమయ్యారు.

అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా మరొకసారి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నదట. ఎందుచేత అంటే హీరో యష్ నటిస్తున్న కే జి ఎఫ్ 2, విజయ్ నటిస్తున్న బీస్ట్ సినిమా విడుదల కారణంగా ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న ట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఇలాంటి బడా సినిమాలు విడుదల అవుతున్నప్పుడు సినిమా ఎంత బాగున్నప్పటికీ ప్రేక్షకులు అంతగా మొగ్గు చూపారని ఆలోచనతో చిత్రం మే నెలలో సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. ఇక ఈ విషయాన్ని చిత్రబృందం అధికారిక ప్రకటన తెలియాల్సి ఉంది. ఇక తెలుగులో కూడా ఇమే మహేష్ తో కలిసి నటిస్తోంది.

కీర్తి సురేష్ తన కెరీర్లో ఎన్నో ఫ్లాపులు వచ్చినప్పటికీ కూడా ప్రస్తుతం అగ్రహీరోలతో నటించే అవకాశాలను సంపాదించుకుంటునే ఉంది. అంతే కాకుండా తన ఎక్కడికి వెళ్లిన ఒక తెలుగమ్మాయి లాగానే వెళుతూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సంతోష పరిచయం చేస్తూ ఉంటుంది కీర్తీ. ఇక ఈ సినిమాలతో నైనా ఈమె కెరీర్ మలుపు తిరుగుతుందో ఏమో చూడాలి మరి. ఇక ప్రస్తుతం ఎక్కువగా ఇప్పుడు భారీ బడ్జెట్ మూవీ లోనే విడుదల చేస్తున్నారు చిత్ర బృందం. ఇక ఇలాంటి సమయంలో ఇలాంటి చిన్న సినిమాలు అంటే కష్టం అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: