"రాధేశ్యామ్" ప్రభాస్ కు 2022 లో ఫస్ట్ హిట్ అవుతుందా ?

VAMSI
మరికొద్ది గంటల్లో ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్న, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాధేశ్యామ్ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. భారీ పాన్ ఇండియా మూవీ అయిన ఈ సినిమాను ఎంతో ఘనంగా విడుదల చేసేందుకు ముస్తాబు చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ టీజర్, గ్లిమ్స్, సాంగ్స్ వంటివి భారీగా అంచనాలను పెంచగా ప్రముఖ ఫిలిం క్రిటిక్ ఉమైర్ సంధు ఫస్ట్ రివ్యూ చెబుతూ బ్లాక్ బస్టర్ మూవీ అంటూ ఖితాబు పలుకుతూ ప్రశంసలు కురిపించడంతో మరింత ప్లస్ అయ్యింది. సినిమా ఎలా ఉండబోతుంది అన్న దానిపై ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉన్నాయి. అయితే సినిమా రిలీజ్ అయితే కానీ ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందా లేదా అన్నది తెలియదు.
అయితే ఈ సినిమా మెయిన్ లైన్ లవ్ స్టోరీ కావడం, అందులోనూ అభిమానులకు నచ్చే నమ్మకం ఉండే జ్యోతిష్యం పాయింట్ థీమ్ కావడం, ఆశ్చర్యపరిచే విజువల్స్ పుష్కలంగా ఉండటం వంటివి ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులకు దగ్గర చేసి అంచనాలకు మించిన సక్సెస్ ను అందిస్తాయి అన్నది చాలా మంది విశ్లేషకుల అభిప్రాయం. అందులోనూ ఈ సినిమాని బీట్ చేసే మరో పెద్ద సినిమా రిలీజ్ కు దగ్గర్లో లేకపోవడం మరో ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఇలా ప్రభాస్ కు ఇది అన్ని విధాలా కలిసొచ్చే కాలమే అంటున్నారు మరి.  అయితే రేపటి వరకు వెయిట్ చేస్తే కానీ క్లారిటీ రాదు. ఈ సినిమా కనుక హిట్ అయితే ప్రభాస్ కు ఈ సంవత్సరం మంచి ఓపెనింగ్ అవుతుందని నమ్మకంతో ఉన్నారు.
ఇక పాన్ ఇండియా హీరో ప్రభాస్ తదుపరి ప్రాజెక్ట్ ల వివరాల్లోకి వెళితే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆదిపురుష్‌ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో చాలా బిజీగా ఉండగా, ‘స‌లార్', 'స్పిరిట్' మరియు ‘ప్రాజెక్ట్‌-K’ లు ఇప్పుడు షూటింగ్‌ దశలో బిజీబిజీగా ఉన్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: