బుల్లితెరపై తెగ వినోదం పంచుతున్నకామెడీ షో ఏది అంటే జబర్ధస్త్ కార్యక్రమం. ఇందులో అందరూ కూడా నవ్వులు పంచుతూ ప్రేక్షకులకి తెగ వినోదం పంచుతూ ఉంటారు.
రోజా కూడా తనదైన శైలిలో పంచ్‌లు వేస్తూ బాగా హాస్యం పంచుతూ ఉంటుంది. తాజాగా ఎక్స్‌ట్రా జబర్ధస్త్ ప్రోమో విడుదల కాగా, ఇందులో సుడిగాలి సుధీర్ మాంత్రికుడు వేషం ధరిస్తాడట.. అయితే విష్ణు ప్రియ కూడా ఇందులో ఒక రోల్ కూడా చేసింది. ఆమె గెటప్ వేయగా, అది చూసిన రోజా.. నీకంటే విష్ణు ప్రియనే బాగుంది అంటూ సుధీర్ పరువు తీసిందట.. ఇక సుధీర్ అయితే రామ్ ప్రసాద్ తో పాటు తోటి కంటెస్టెంట్స్‌తో తెగ సందడి సందడి చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో అయితే వైరల్‌గా మారింది.
సుడిగాలి సుధీర్- రష్మి మధ్య ఎఫైర్ వార్త చక్కర్లు కొట్టినంతగా.. బుల్లితెరపై ఇంతకు మించిన రూమర్ లేదనే చెప్పవచ్చు.అయితే అదంతా స్క్రీన్‌పై రొమాన్స్ బాగా పండించడంలో భాగం తప్ప.. మరేం లేదని.. పర్శనల్ లైఫ్‌లో ఎవరిదారి వారిదే అంటూ క్లారిటీ కూడా ఇచ్చారు. రష్మి ఇప్పటికే వేరే వ్యక్తితో లవ్‌లో ఉండగా.. సుధీర్ పెళ్లి ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. ఇక రష్మి తరువాత సుధీర్‌తో ఎఫైర్ లిస్ట్‌లో పోటీ పడుతోంది హాట్ యాంకర్ విష్ణు ప్రియ. ఈ మధ్య కాలంలో డాన్స్‌లతో రచ్చ రచ్చ చేస్తూ సోషల్ మీడియాలో అందాలను ఆరబోస్తున్న విష్ణు ప్రియతో సుధీర్‌కి ఎఫైర్ నడుస్తోందంటూ వస్తున్న రూమర్స్‌పై స్పందించారు నటి విష్ణు ప్రియ.
ఆ మధ్య విష్ణు ప్రియ.. సుధీర్‌తో రిలేషన్‌పై నోరు విప్పిందట.సుధీర్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని నా ఫస్ట్ ఇండస్ట్రీ ఫ్రెండ్ సుధీర్ అని ఎప్పుడు ఎలాంటి ఇబ్బంది వచ్చినా వెంటనే నేను సుధీర్‌కి ఫోన్ చేస్తా. శ్రీముఖిమరియు కీర్తనలు నాకు పిల్లర్స్ లాంటి వాళ్లు నేను ఏదైనా తప్పు చేస్తుంటే.. వీళ్లు చూస్తున్నారేమో అని ఫీల్ అయ్యేటంతగా నా లైఫ్‌లో వాళ్లు ఒక పార్ట్ అయ్యారని తెలిపింది.. నేను కూడా చాలా నాటీ.. శ్రీముఖిలాగే. వీళ్ల మధ్యన నేను పిల్ల బచ్చాని. నా పర్శనల్ విషయంల్లో వాళ్లు సలహాలు నాకు చాలా ఉపయోగపడతాయి. మా ఇద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉంటుంది అంటూ విష్ణు ప్రియ చెప్పుకొచ్చింది.