పాన్ ఇండియా మూవీ స్టార్ ప్రభాస్ తో హోంబలె ఫిలిమ్స్ సంస్థ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ సలార్. మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పక్కాగా మాస్ రోల్ చేస్తుండగా అందాల భామ శృతిహాసన్ ఆయనకి జోడిగా నటిస్తోంది. భువన గౌడ ఫోటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నారు.
కెజిఎఫ్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి నిర్మాత విజయ్ కిరగండూర్. కొన్నాళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా దీనిని ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని అలరించేలా దర్శకుడు ప్రశాంత్ నీల్ తీస్తున్నట్లు ఇన్నర్ వర్గాల టాక్. క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా అత్యున్నత సాంకేతిక విలువలతో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ సినిమాలో విలక్షణ నటుడు జగపతి బాబు, ఈశ్వరి రావు, మధు గురుస్వామి ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
అయితే విషయం ఏమిటంటే, త్వరలో తన లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్న ప్రభాస్, మూడు రోజుల నుండి పలు మీడియా ఛానల్స్ వారికి ఇంటర్వ్యూ లు ఇవ్వడంతో పాటు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా అందులో భాగంగా నేడు రాధేశ్యామ్ మలయాళ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడిన ప్రభాస్, సలార్ మూవీ గురించి కూడా మాట్లాడుతూ, ప్రముఖ మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తమ సలార్ లో ఒక ముఖ్య పాత్ర చేస్తున్నారని, సినిమా స్క్రిప్ట్ తో పాటు తన పాత్ర కూడా ఆయనకు ఎంతో బాగా నచ్చడంతో చేయడానికి వెంటనే ఒప్పుకున్నారని, ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, తప్పకుండా త్వరలో షూటింగ్ పూర్తి అయి ఆపైన రిలీజ్ కానున్న సలార్ మూవీ అన్ని భాషలలో కూడా పెద్ద సక్సెస్ కొడుతుందని ప్రభాస్ ఆశాభావం వ్యక్తం చేసారు.