ప్రేమకథ సినిమాలను రూపొందించే దర్శకుడిగా
టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దర్శకుడు
శివ నిర్వాణ. ఆయన సినిమాలను చేయడం ప్రారంభించిన దగ్గరినుంచి
ప్రేమ కథా సినిమాలనే చేసి మంచి అనుభూతి ప్రేక్షకులందరికీ కలిగించాడు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు చేయబోయే తదుపరి సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన
టక్ జగదీష్ సినిమా ప్రేక్షకులను అలరించడం పూర్తిగా విఫలం అయింది.
ఈ నేపథ్యంలో ఇప్పుడు చేయబోయే
సినిమా తప్పకుండా ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. దానికి తగ్గట్లుగానే ఈ
టాలీవుడ్ స్టార్
హీరో విజయ్ దేవరకొండ తో ఆయన తన తదుపరి
సినిమా చేస్తున్నాడు.
విజయ్ దేవరకొండ హీరోగా
టాలీవుడ్ లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో. ఈ నేపథ్యంలో ఈ హీరోతో ఆయన ఓ మంచి ప్రేమకథా చిత్రాన్ని చేసి ప్రేక్షకులను భారీగా అలరించాలని భావిస్తున్నాడు.
అయితే కొన్ని రోజులుగా ఈ దర్శకుడు
విజయ్ దేవరకొండ తో
సినిమా చేయడం లేదని అది క్యాన్సల్ అవుతుంది అని వార్తలు వినిపించాయి. కానీ ఏ విధంగా
విజయ్ దేవరకొండ నొప్పించాడు తెలియదు కానీ ఈ
సినిమా క్యాన్సిల్ కాలేదని వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి ఇకపోతే ఈ
సినిమా కోసం మరిన్ని స్పెషల్స్ తీసుకువచ్చారు
శివ నిర్వాణ.
సమంత ఈ చిత్రంలో
హీరోయిన్ గా నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇక ఈ
సినిమా కోసం
కోలీవుడ్ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందించబోతున్నారు. ఈ నేపథ్యంలో వీరి కలయికలో రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. ఇక
విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం లైగర్ అనే
సినిమా తెరకెక్కుతుంది. ఆగస్ట్ 25 వ తేదీన ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.