హీరో సూర్య మళ్లీ అదే తప్పు చేస్తున్నారు..!!
హీరో సూర్య జయాపజయాలతో సంబంధం లేకుండా తనకు ఇష్టమైన డైరెక్టర్ బాల కు మరొక అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. దీంతో అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ వర్గాల్లో కూడా ఈ విషయం చర్చనీయాంశంగా మారుతోంది. అయితే కొంతమంది మాత్రం ఇది సూర్య ఛాయిస్ అన్నట్లుగా తెలియజేస్తున్నారు.. ప్రస్తుతం మారిన ట్రెండ్ ప్రయోగాత్మకంగా కథలకు ప్రజలు ఎక్కువగా ఆకర్షిస్తున్నారు. అందుచేతనే సరైన సమయంలో సూర్య సరైన నిర్ణయం తీసుకున్నారని వార్త కూడా వినిపిస్తోంది.. శివపుత్రుడు సినిమాతో సూర్య బాల జోడికి ప్రశంసలు అందుకోవడం జరిగింది. ఇక ఈ సినిమాకు ఎన్నో ఫిలింఫేర్ అవార్డులు కూడా రావడం జరిగింది.
ఇందులో సూర్య తో పాటు విక్రమ్ కూడా అద్భుతమైన నటనని ప్రదర్శించాడు అని చెప్పవచ్చు.. ఇక హీరో విక్రమ్ కు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు రాగా.. సూర్య కు మాత్రం సహాయ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు అందుకున్నారు. ఆ తరువాత సూర్యతో బాల సినిమా చేస్తున్నారని టాక్ వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కుదరలేదు. అయితే తాజాగా వీరిద్దరూ ఒక ప్రాజెక్టుకోసం కలిసి వస్తున్నారని సూర్య తన ట్విట్టర్లో ఈ విషయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక 20 సంవత్సరాల తరువాత తన తో సినిమా చేస్తున్నాడట సూర్య.