వామ్మో: పాయల్ తో రొమాన్స్ చేయనున్న మంచు విష్ణు..!!

Divya
మంచు ఫ్యామిలీ నుండి మంచు విష్ణు ఎన్నో సినిమాలలో నటించాడు. ఇప్పుడు తాజాగా మా అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయ్యాడు. మంచు విష్ణుకు సంబంధించి  సరికొత్త సినిమా అంటే జనాలలో కొన్ని అనుమానాలు మొదలవుతున్నాయి. దాదాపుగా మంచు ఫ్యామిలీలో కూడా హిట్ కొట్టాక చాలా సంవత్సరాలు కావస్తోంది.. ఇక మంచు మనోజ్ అయితే సినిమాలను మధ్యలోనే వదిలేశారు అన్నట్లు వార్తలు వినిపించాయి. లాక్ డౌన్ కంటే ముందు ఒక సినిమాని తీయాలి అనుకున్నాడు కానీ ఆ ప్రాజెక్టు మధ్యలోనే నిలిచిపోయింది అన్నట్టుగా వార్తలు వినిపించాయి. ఇక తాజాగా సన్ ఆఫ్ ఇండియా అనే సినిమా విడుదల కాగా ఈ చిత్రానికి సరైన స్పందన లభించలేదు.

ఇక మంచు విష్ణు హీరోగా వచ్చిన లాస్ట్ సినిమా మోసగాళ్లు.. ఈ సినిమా భారీ నష్టాన్ని చవిచూసింది. అయితే ఢీ సినిమాకి సీక్వెల్ ని తీయబోతున్నానని ఆ మధ్య ప్రకటించడం జరిగింది. ఈ సినిమాను కూడా శ్రీను వైట్ల నిర్మిస్తున్నాడు అనే వార్తలు వినిపించాయి. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. తాజాగా మంచు విష్ణు కు సంబంధించి ఒక  కొత్త సినిమాను ప్రారంభించడం జరిగింది. ఇక అందులో కథానాయికగా పాయల్ రాజ్ పుత్ నటిస్తోంది.

మంచువారి అతిథ్యంలో పాయల్ రాజ్ పుత్ ఎంట్రీ ఇస్తోంది అన్నట్లుగా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఇక ఈ సినిమా ప్రమోషన్ కూడా కాస్త వెరైటీగా ప్రారంభించారు. ఇక తమ పాత్రలకు సంబంధించి మంచు విష్ణు, పాయల్ చేసిన కొన్ని పోస్టులు తెగ సందడి చేస్తున్నాయి. మంచు విష్ణు ఈ సినిమాలో గాలి నాగేశ్వరరావు గా సరికొత్త పాత్ర పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా విషయాలను పంచుకోవాలని చాలా ఆతృతగా ఉందని చెప్పుకొచ్చాడు మంచు విష్ణు. ఇక పాయల్ కూడా ఒక ఒక ఆర్ట్ ఫోటోని షేర్ చేసింది. అందులో తన పేరు స్వాతి అన్నట్లుగా తెలియజేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: