భీమ్లా నాయక్ వసూళ్ల సునామీ.. కాని బ్రేక్ ఈవెన్ కాలేదే..!

Purushottham Vinay
టాలీవుడ్ స్టార్ హీరోలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా దగ్గుబాటి రానా కాంబినేషన్లో అయ్యారే సినిమా డైరెక్టర్ సాగర్ చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా 'భీమ్లా నాయక్'. మలయాళం బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని 'సితార ఎంటెర్టైన్మెంట్స్' బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించాడు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ సినిమాకి డైలాగ్స్ ఇంకా అలాగే స్క్రీన్ ప్లే ను అందించడం అనేది జరిగింది. ఫిబ్రవరి 25 వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి షోతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.


ఇక ఆంధ్ర ప్రదేశ్ లో టికెట్ రేట్ల వివాదం నడుస్తున్నప్పటికీ ఈ సినిమా భారీగా వసూళ్లను కలెక్ట్ చేసింది. ఇక విడుదల అయ్యి 6 వ రోజున కూడా ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. ఇక ఒకసారి ఈ సినిమా 6 రోజుల కలెక్షన్లను చూసినట్లయితే..ఇక 'భీమ్లా నాయక్' సినిమాకి మొత్తం రూ.109.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.110 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాలి. ఫస్ట్ వీక్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.84.7 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.25.3 కోట్ల షేర్ ను ఈ సినిమా రాబట్టాలి. 7 వ రోజున కూడా ఈ సినిమా రూ.1 కోటి వరకు షేర్ ను రాబట్టింది.


ఇంకా మరో వీకెండ్  ఉంది కాబట్టి.. 'భీమ్లా నాయక్' సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే చాలా వరకు ఉన్నాయి.ఇక ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి జంటగా నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా ఇంకా రానా కి జంటగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ ఎస్ థమన్ అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా అలాగే అదిరిపోయే పాటలను ఈ సినిమాకి అందించాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోరుకునే అన్ని రకాల మాస్ ఎలివేషన్స్ అనేవి వున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: