ఆ స్టార్ హీరోల సినిమాలు అప్పుడే...!

NAGARJUNA NAKKA
కరోనా పాండమిక్‌ స్టార్ట్ అయ్యాక ఫిల్మ్‌ ఇండస్ట్రీకి పండగలు, హాలిడే సీజన్లు అన్ని క్లోజ్ అయ్యాయి. కేసులు పెరగగానే షూటింగులు ఆగిపోవడం, సినిమా రిలీజులు వాయిదా పడ్డం కామన్‌గా జరిగిపోతోంది. అయితే ఒమిక్రాన్‌ వేరియెంట్‌తో పాండమిక్‌ కాస్తా ఎండమిక్‌గా మారుతుందని చాలామంది శాస్త్రవేత్తలు చెప్పారు. దీంతో టాప్ హీరోలంతా ఫ్యూచర్‌ ప్రాజెక్ట్స్‌ని పరుగులు పెట్టిస్తున్నారు. పండగలు, హాలిడే సీజన్స్‌ని క్యాష్‌ చేసుకోవడానికి రిలీజ్‌ డేట్స్‌ లాక్ చేసుకుంటున్నారు.

ప్రభాస్‌ కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ చేస్తోన్న మైథాలజీ మూవీ 'ఆదిపురుష్‌'. వాల్మీకి రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్ట్‌ 11న రిలీజ్ కావాల్సింది. కానీ ఆమిర్ ఖాన్‌ 'లాల్‌ సింగ్ చడ్డా' కోసం 'ఆదిపురుష్‌'ని పోస్ట్‌ పోన్ చేసుకున్నాడు ప్రభాస్. అయితే ఆగస్ట్‌ నుంచి పోస్ట్‌ పోన్ అయిన ఈ సినిమా దీపావళికి తీసుకొస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ ప్రభాస్‌ మాత్రం ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న విడుదల చేస్తున్నాడు. రామ్ చరణ్ 'ఆర్ ఆర్ ఆర్'తో పాన్‌ ఇండియన్‌ మార్కెట్‌లో స్టార్డమ్‌ వస్తుందని నమ్మకంగా ఉన్నాడు. రాజమౌళి బ్రాండ్‌తో నార్త్‌లో మంచి మార్కెట్‌ సంపాదించొచ్చని ఆశ పడుతున్నాడు. ఈ లెక్కలతోనే శంకర్‌ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్‌ ఫిల్మ్‌ చేస్తున్నాడు చరణ్. దిల్ రాజు నిర్మాణంలో పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందీ సినిమా. ఇక ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు మేకర్స్.

రాజమౌళి హ్యాండ్‌ పడితే చాలు చిన్న హీరోలు కూడా పెద్ద స్టార్లు అయిపోతారనే ట్రెండ్‌ నడుస్తోంది. ఇక 'ఆర్ ఆర్ ఆర్'తో జూ.ఎన్టీఆర్‌ కూడా పాన్‌ ఇండియన్ మార్కెట్‌ని ఫోకస్ చేశాడు. 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషనల్‌ ఈవెంట్స్‌లో హైలెట్ అయ్యాడు. మిలీనియల్స్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక 'ఆర్ ఆర్ ఆర్'తో వస్తోన్న గుర్తింపుని మరింత పెంచుకోవడానికి కొరటాల శివ దర్శకత్వంలో భారీ సినిమా చేస్తున్నాడు.

ప్రభాస్, జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్‌ సినిమాలు మూడు భారీ బడ్జెట్‌తోనే తెరకెక్కుతున్నాయి. ఒక్కో సినిమాకి 300 కోట్ల నుంచి 400 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు ట్రేడ్‌ పండిట్స్. సో వచ్చే ఏడాదికి 1200 కోట్ల యుద్ధం జరగబోతోందని చెప్పొచ్చు. ఇక ఈ భారీ పందెంతో బాక్సాఫీస్‌కి కూడా బోల్డంత ఎనర్జీ వచ్చే అవకాశముంది. అయితే నిర్మాతలు పోటీ వద్దు.. కలెక్షన్లు ముద్దు అనే ఫార్మాట్‌కి వెళ్తే మాత్రం మూడింటిలో రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యే అవకాశముంది అంటున్నారు సినీజనాలు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: