ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా జగపతిబాబు ఎంతో క్రేజ్ సంపాదించాడు.. అంతగా ప్రేక్షకులను జగపతిబాబు బాగా దగ్గరయ్యాడు. కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో ప్రస్తుతం పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు. ప్రస్తుతం ప్రతి సినిమాలో కూడా నటిస్తూ బిజీ లైఫ్ ని కొనసాగిస్తున్నాడు. అగ్రహీరోల సరసన కొన్ని కీలకమైన పాత్రలలో నటిస్తూ ఉన్నాడు. ప్రస్తుతం జగపతిబాబు దుబాయిలో ఒక ప్రాంతంలో షాపింగ్ మాల్ లో షాపింగ్ చేసి తన అభిమానుల కోసం ఆ ఫోటోని షేర్ చేయడం జరిగింది.
ఆ ఫోటోలో జగపతి బాబు షాపింగ్ చేసి వచ్చి అలసిపోయి కూర్చొని విశ్రాంతి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆ పక్కనే తను షాపింగ్ చేసిన కొన్ని వస్తువులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ప్రముఖ బ్రాండెడ్ బట్టల ను కొనుగోలు చేసి.. ఇలా మీడియా కి చిక్కడంతో తన గతాన్ని కూడా గుర్తు చేసుకున్నాడు జగపతిబాబు. జగపతిబాబు హీరోగా ఉన్నంతకాలం కొన్ని కోట్ల రూపాయలను సంపాదించినట్లు సమాచారం. ఇక తన తండ్రి కూడా ఒక నిర్మాత కావడం గమనార్హం. ఇలా రెండు విధాలుగా జగపతి బాబు టాలీవుడ్ లో ఒక వెలుగు వెలిగారు అని చెప్పవచ్చు. అయితే కొన్ని కారణాల వల్ల జగపతిబాబు సంపాదించిన ఆస్తులు అన్నీ కూడా కరిగిపోయాయట.
ఒకానొక సమయంలో తను ఆర్థికంగా అప్పుల్లో కూరుకు పోయినప్పుడు.. తన తండ్రి ఇచ్చిన ఇల్లు కూడా వదిలేయాల్సి వచ్చిందట. దీనితో కొన్ని రోజులపాటు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయినట్లు సమాచారం. ఆ తరువాత హీరో నుంచి బయటికి వచ్చి తన కొత్త జీవితాన్ని ప్రారంభించాడు. అలా అలా తను పోగొట్టుకున్న ఆస్తులను తిరిగి సంపాదించుకున్నాడు జగపతిబాబు. అలా ప్రస్తుతం వెండితెరపై కూడా పలు కారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని బ్రహ్మాండంగా ముందుకు కొనసాగిస్తున్నాడు అని చెప్పవచ్చు. ఇక విలన్ గా కూడా తనదైన మార్కు ని వేసుకున్నాడు జగపతిబాబు.