ఆ రిమేక్ కోసం పవన్ రెమ్యూనరేషన్ ఒక్క రోజుకే అన్ని కోట్లా..?

Anilkumar
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు పవన్. యువ దర్శకుడు సాగర్ కేంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫిబ్రవరి 25న విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో దూసుకుపోతోంది. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమాని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా చేయాల్సి ఉంది.


అయితే ఈ సినిమాకంటే ముందే తమిళ చిత్రం 'వినోదయ సిత్తం' అనే సినిమాను రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులు కూడా మొదలు కానున్నాయట. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ 20 రోజులకు గాను పవన్ కళ్యాణ్ ఏకంగా 50 కోట్ల వరకూ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇదే కనుక నిజమైతే ఒక్క రోజుకు పవన్ కళ్యాణ్ కి 2.5 కోట్లు చొప్పున పారితోషకం దక్కనుంది.


దీంతో ప్రస్తుతం పవన్ రెమ్యునరేషన్ టాలీవుడ్ లోనే చర్చనీయాంశమవుతోంది. అయితే పవన్ కళ్యాణ్ కున్న క్రేజ్ దృష్ట్యా ఎంత రెమ్యునరేషన్ ఇవ్వడానికైనా నిర్మాతలు రెడీగా ఉన్నారు. ఇక ఈ రీమేక్ లో పవన్ కళ్యాణ్ తో పాటు మరో మెగాహీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాసరావు ఈ రీమేక్ కి సంబంధించి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కథలో మార్పులు చేర్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో కూడా ఆయనే రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు మార్చి 25న జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: