'గని' కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్...

VAMSI
మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఏ హీరో కైనా మొదట్లో అభిమానుల్లో క్రేజ్ మాములుగా ఉండదు. అయితే అది కేవలం ఒకటి రెండు సినిమాల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వారికి టాలెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారు లేదంటే అలా పక్కన ఉండిపోవాల్సిందే. అదే విధంగా ముకుంద లాంటి క్లాసికల్ సినిమాతో వచ్చిన మెగా బ్రదర్ నాగబాబు తనయుడు మెగా హీరో వరుణ్ తేజ్ తన నటనతో హావ భావాలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. అలా ఒక్కో సినిమాకు తనలో ఉన్న నటుడిని బయటకు తెస్తూ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకమైన అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ నుండి రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ఒకటి మల్టీ స్టారర్ మూవీ "ఎఫ్ 3" కాగా, మరొకటి వరుణ్ తేజ్ ప్రధాన పాత్ర పోషించిన "గని".

ఈ సినిమా ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న విషయం తెలిసిందే. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్ సరసన సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. వివిధ పాత్రలలో సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర లాంటి స్టార్ లు నటిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్, టీజర్ మరియు పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ తేదీని గీత ఆర్ట్స్  అధికారికంగా ప్రకటించింది. మొదట్లో డిసెంబర్ లో, ఆ తర్వాత ఫిబ్రవరి లో విడుదల చేయాలని అనుకున్నా వివిధ కారణాలతో అవి కాస్తా వాయిదా పడ్డాయి.

ఇప్పుడు ఏప్రిల్ 8 న రిలీజ్ చేయాలని భావిస్తోంది. దీనితో మెగా ఫ్యాన్స్ అంతా ఫుల్ హ్యాపీ. మరి చూద్దాం ఈ డేట్ లో అయినా గని వస్తాడా లేదా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: