ప్రేమించుకుంటూనే ఉంటారా.. పెళ్ళి సంగతేంటి..!

NAGARJUNA NAKKA
రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి గురించి మూడేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఇరు కుటుంబాలు వీళ్ల పెళ్లికి అంగీకరించాయని పెళ్లి పీటలెక్కడమే తరువాయి అనే వార్తలు కూడా వినిపించాయి. పెళ్లి షాపింగ్‌ చేస్తున్నారనే టాక్ కూడా నడిచింది. కానీ వీళ్లు మాత్రం ఇంకా పెళ్లి పీటలెక్కలేదు. ఇదే విషయాన్ని ఆలియా భట్‌ దగ్గర కొంతమంది ప్రస్తావించారు. దీనికి ఆలియా ఫిలాసఫికల్‌ ఆన్సర్‌ ఇచ్చింది. రణ్‌బీర్ కపూర్‌ని ఫస్ట్‌ టైమ్‌ సిల్వర్‌ స్క్రీన్‌పై చూసినప్పుడే పెళ్లి చేసుకోవాలనుకున్నా. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికే పెళ్లి చేసుకుంటారు. ఆ లెక్కన చూస్తే తాను చాలా ప్లజెంట్‌ మూడ్‌లో ఉన్నా... రణ్‌బీర్‌ నా ఇష్టాలని గౌరవిస్తున్నాడు, తాను కూడా అతని ఇష్టాలని గౌరవిస్తున్నానని చెప్పింది. అయితే తమ మనసులు కలిశాయి కాబట్టి, తమ పెళ్లి ఎప్పుడో అయిపోయిందంటోంది. దాని గురించి ఇంకా ఆలోచించాల్సిన పనిలేదంటోంది ఆలియా. ఇక రణ్‌బీర్, ఆలియా రెండేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నారని బాలీవుడ్ నుంచి వస్తోన్న సమాచారం.  
అర్జున్‌ రామ్‌పాల్ కూడా రీసెంట్‌గా ఇలాంటి ప్రకటనే చేశాడు. నాలుగేళ్ల నుంచి సౌతాఫ్రికా మోడల్‌ గాబ్రియోల్లా డిమెత్రియాదెస్‌తో లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు అర్జున్. వీళ్లిద్దరికీ మూడేళ్ల కిందట ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ ఇప్పటికీ వీళ్లు పెళ్లి చేసుకోలేదు. అయితే రింగులు మార్చుకొని ఏడడుగులు వేస్తేనే పెళ్లి కాదు, మనసులు కలిశాయి అంటేనే పెళ్లి అయ్యిందని అర్థం. మళ్లీ సెపరేట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పాడు అర్జున్‌ రామ్‌ పాల్. అర్జున్ కపూర్, మలైకా అరోరా అయిదేళ్ల నుంచి రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఫారెన్‌ టూర్స్‌తో హాలిడేస్‌ని సెలబ్రేట్ చేసుకున్నారు. వాలెంటైన్స్‌ డేస్‌కి పార్టీలు చేస్తున్నారు. బాలీవుడ్‌ న్యూ కపుల్స్‌కి లవ్ గోల్స్‌ కూడా సెట్ చేస్తున్నారు. అయితే భార్యాభర్తల కంటే ఎక్కువగా కలిసిపోయిన వీళ్లిద్దరు పెళ్లిని మాత్రం దూరం పెడుతున్నారు. మలైకాకి 48 ఏళ్లు వచ్చినా, అర్జున్ 36లో ఉన్నా పెళ్లి గురించి ఆలోచించడం లేదు.  
విఘ్నేష్ శివన్, నయనతార లవ్‌స్టోరి 7 ఏళ్ల నుంచి నడుస్తోంది. ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక, ఇద్దరూ చెన్నైలో ఇల్లు తీసుకున్నారని థర్డ్‌ వేవ్‌ తగ్గిపోగానే పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా జరిగింది. అయితే పాండమిక్‌ ప్రభావం తగ్గినా ఈ కపుల్‌ మాత్రం పెళ్లి డేట్‌ అనౌన్స్‌ చెయ్యలేదు. ఇంకా లివ్‌-ఇన్‌-రిలేషన్‌లోనే ఉన్నారు.
టైగర్ ష్రాఫ్, దిశా పఠాని లవ్‌స్టోరి ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌లా నడుస్తోంది. కొన్నాళ్లు టైగర్‌ ఫ్యామిలీ ఒప్పుకుంది ఇంక ఈ లవ్‌ బర్డ్స్‌ పెళ్లి పీటలెక్కడమే తరువాయి అని వార్తలు వస్తాయి. మళ్లీ ఆ నెక్ట్స్‌ డేనే కెరీర్‌ కోసం ఇద్దరూ లవ్‌స్టోరీకి బ్రేక్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాతి రోజే ఇద్దరూ కలిసి డిన్నర్‌ డేట్‌లో కనిపిస్తారు. లాక్‌డౌన్‌లో కూడా ఇద్దరూ కలిసి వీధుల్లో తిరుగుతూ వార్తలకెక్కారు. అయితే పెళ్లిపీటలు ఎక్కడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: