భీమ్లా హిట్ తెగ ఎంజాయ్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!!

murali krishna
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన భీమ్లా నాయక్ విడుదల అయ్యి అతి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా వంద కోట్ల వసూళ్ల కు దాదాపు గా చేరువైందట.

రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ అక్కడ ఇక్కడ తేడా లేకుండా అన్ని చోట్ల మంచి వసూళ్ల ను దక్కించు కుంటుందని సమాచారం.. ఈ సినిమా కు సంబంధించిన టాక్ పాజిటివ్ ఉండడం తో వసూళ్లు అంతకు మించి అన్నట్లుగా నమోదవుతున్నాయి ఈ సినిమాకు దర్శకుడు సాగర్ కే చంద్ర అయినప్పటికీ పూర్తి క్రెడిట్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి వెళ్తుంది గా అంటూ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒక మలయాళం సినిమా పూర్తి గా మార్చి డైరెక్ట్ తెలుగు గా మార్చాడు అంటూ దర్శకుడు త్రివిక్రమ్ అభిమానులు ఎంతో ఆనందం గా కామెంట్స్‌ చేస్తున్నారు.

త్రివిక్రమ్ వల్లె భీమ్లా నాయక్ ఈ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్న అంటూ ప్రతి ఒక్కరూ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆయన లేకపోతే సాగర్ చంద్ర ఈ సినిమా ను ఆ స్థాయిలో అస్సలు తీసి ఉండేవారు కాదేమో అనిపిస్తుంది. పవన్ పై ఉన్న అభిమానం తో మరియు స్నేహం తో భీమ్లా నాయక్ కి స్క్రిప్ట్ ఇచ్చేందుకు త్రివిక్రమ్ ముందుకు వచ్చాడని సమాచారం.. త్రివిక్రమ్ మార్క్‌ సెన్సేషనల్ హిట్ అయింది బ్లాక్ బస్టర్ అయింది, ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా త్వరలో ప్రారంభం కాబోతుందట. కనుక అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు అభిమానులు ఈ సందర్భం లో సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ ఎంతో సంతోషంగా ఉన్నారు. భీమ్లా నాయక్ కి ఎలా అయితే రచన సహకారం అందించి సూపర్‌ హిట్‌ చేశాడో ఇప్పుడు మహేష్ బాబు సినిమా కూడా అంతే ఘన విజయాన్ని సొంతం చేసుకునేలా చేస్తాడంటూ అంత ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. అల వైకుంఠ పురం లో కి ఏ మాత్రం తగ్గకుండా మహేష్ బాబు తో త్రివిక్రమ్‌ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: