జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా మా అంత మంచి విజయాన్ని సాధించలేకపోయింది.తరువాత తన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్ అయ్యింది. ఇకపోతే నాలుగో సినిమా ఆది బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం.అయితే ఆ వెంటనే అల్లరి రాముడు - సింహాద్రి సినిమాలు కూడా హిట్ అవ్వడంతో ఎన్టీఆర్ ఒక్కసారిగా టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయాడు.ఇక ఇదిలా ఉంటె అప్పటివరకు వరుస ఫ్లాపులతో ఉన్న నాగార్జున అదే సంవత్సరం సంతోషం - మన్మధుడు లాంటి రెండు సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే అంతకు ముందు నాగార్జున తన మేనల్లుడు సుమంత్‌తో కలిసి స్నేహమంటే ఇదేరా సినిమా కూడా చేశాడు. ఇకపోతే ఆ మల్టీ స్టారర్ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు.ఇక అప్పుడు ఎన్టీఆర్ - నాగార్జున ఒకేసారి వరుస హిట్లతో సూపర్ ఫామ్ లో ఉన్నారు.ఇక అప్పుడు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు వీరిద్దరి కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ ఆలోచన చేశారట. అయితే తన సొంత బ్యానర్ లో ఈ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నారు.ఇకపోతే అప్పట్లో నాగార్జున సైతం ఎన్టీఆర్ తో కలిసి నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఓపెన్‌గానే చెప్పారు.అయితే సీనియర్ ఎన్టీఆర్ తన తండ్రి నాగేశ్వరరావు కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు అని.ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు తాను సిద్ధం అని ప్రకటన కూడా చేశారు.
అయితే దీనికి తగిన టైమ్ మరియు ప్లాన్ ఏమాత్రం సెట్ కాలేదట. ఇక దాని అనంతరం జూనియర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి సినిమా తో తన రూపురేఖలు మారిపోయాయి. అయితే ఇలా ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చే టైంకి కాలం కలిసి రాలేదట. కాగా దీని అనంతరం చైతు హీరో అయ్యాక చైతు - ఎన్టీఆర్ కాంబినేషన్లో అలనాటి మేటి క్లాసిక్ సినిమా గుండమ్మ కథ రీమేక్ చేయాలన్న ప్రయత్నాలు కూడా చేశారు. ఇక ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు.ఇకపోతే నాడు ఎన్టీఆర్ - ఏఎన్నార్ తర్వాత వీరు వారసులుగా ఉన్న బాలకృష్ణ - నాగార్జున కూడా కలిసి ఒక్క సినిమాలో కూడా నటించలేదు. అయితే ఇప్పుడు నందమూరి అక్కినేని వంశాలకు చెందిన మూడో తరం హీరోలు అయినా కలిసి మల్టీస్టారర్ సినిమా చేస్తారేమో ? చూడాలి...!!