ఆ ముగ్గురు హీరోలతో ఎఫైర్.. స్పందించిన కలర్స్ స్వాతి?
ఇక తెలుగులో కూడా ఎన్నో సినిమాల్లో నటించి మంచి విజయాలని తన ఖాతాలో వేసుకుంది కలర్స్ స్వాతి కానీ ఇటీవల కాలంలో పెళ్లి చేసుకోవడంతో ఈ అమ్మడికి సరైన అవకాశాలు రావడంలేదూ.ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కలర్స్ స్వాతి తనపై ఎన్నో రోజుల నుంచి వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. గతంలో నానీ, నిఖిల్, జై లాంటి హీరోల పేర్లు లింకులు పెడుతూ కలర్స్ స్వాతి రిలేషన్ షిప్ లో ఉంది అంటూ ఎన్నో వార్తలు టాలీవుడ్లో చక్కెర్లు కొట్టాయి అన్న విషయం తెలిసిందే.ఈ లిస్టులో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరు కూడా వినిపించింది.
ఇక ఇలాంటి రూమర్స్ గురించి విన్నప్పుడు మీకు ఏమనిపిస్తోంది అంటూ అడిగిన ప్రశ్నకు.. ఆసక్తికర సమాధానం చెప్పింది కలర్స్ స్వాతి. మొదటి రూమర్ అల్లరి నరేష్ తో డేంజర్ సినిమా చేసిన సమయంలో వచ్చింది. ఇదేంటి ఇలా అంటున్నారు అని అనుకున్నాను. నిప్పులేనిదే పొగ రాదు అంటారు కానీ రూమర్ నిప్పు లేకుండానే వచ్చేసింది. తన విషయంలో ఎంతో మంది ఎన్నో విధాలుగా మాట్లాడుకున్నారు. నేను ఎక్కువగా బయట కనిపించిన బయట తిరగను కూడా. ఇక తాను నటించిన చాలా మంది హీరోలతో తనకు రిలేషన్షిప్ ఉంది అంటూ ఎన్నో పుకార్లు పుట్టించారు అంటూ స్వాతి చెప్పుకొచ్చింది. ఇలాంటి రూమర్స్ చూసినప్పుడు బాధ పడ్డాను. ఆ తర్వాత మాత్రం రూమర్స్ ను పట్టించుకోవడం మానేసాను. కొన్ని కొన్ని సార్లు మాత్రం నా గురించి వేరే వాళ్ళు చండాలంగా మాట్లాడుతుంటే ఎంతో ఇబ్బంది అనిపిస్తుంది అంటూ స్వాతి చెప్పుకొచ్చింది.