యంగ్ హీరో నితిన్ కు ‘భీష్మ’ తరువాత అంతటి హిట్ పడలేదనే సంగతి తెలిసిందే. ఇక నితిన్ నటించిన గత మూడు చిత్రాలు చెక్, రంగ్ దే, మాస్ట్రో చిత్రాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే ప్రస్తుతం నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ అనే సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇకపోతే తాజాగా ఈ యంగ్ హీరో ఖాతాలో అరుదైన రికార్డు పడింది.కాగా అది కూడా టాలీవుడ్ లో కాదు బాలీవుడ్ లో !ప్రస్తుతం ఇప్పుడు భాషతో సంబంధం లేకుండా నటీనటులు పాన్ ఇండియా సినిమాలతో హిందీలోనూ రాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే టాలీవుడ్ హీరో నితిన్ కూడా ఇప్పుడు హిందీ ప్రేక్షకుల హృదయాలను ఏలుతున్నాడు.
అంతేకాదు స్ట్రెయిట్ హిందీ సినిమా చేయనప్పటికీ అక్కడ ఆయన విశేషమైన ఆదరణను మూటగట్టుకుంటున్నాడు. ఇకపోతే దక్షిణాది నుండి వివిధ ఛానెల్‌లలో తన హిందీ డబ్బింగ్ చిత్రాలకు కలిపి 2.3 బిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టుకున్న ఏకైక టాలీవుడ్ స్టార్ నితిన్. అయితే ఏ సౌత్ స్టార్‌కి ఇంతటి భారీ సంఖ్యలో వ్యూస్ రాలేదనే చెప్పాలి. కాగా జానర్‌తో, హిట్స్ ప్లాప్ లతో సంబంధం లేకుండా నితిన్ అన్ని హిందీ డబ్బింగ్ వెర్షన్ చిత్రాలకు వీక్షణలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే నితిన్ సినిమా హిందీ రైట్స్ భారీ మొత్తాలను వసూలు చేయడంతో ఇది అతని నిర్మాతలకు ప్లస్‌గా మారింది.
దీంతో రానున్న రోజుల్లో నితిన్ తన సినిమాలని హిందీలో కూడా డబ్ చేసి రిలీజ్ చేసే అవకాశాలున్నట్లు ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పొలిటికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో నితిన్ కి జోడిగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి భారీ స్థాయిలో స్పందన లభించింది. వేసవి కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా అనంతరం ప్రముఖ రచయిత వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ సినిమాకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు...!!