రికార్డుల వేటలో 'భీమ్లా నాయక్'.. యూఎస్ లో సరికొత్త రికార్డ్..?

Anilkumar
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఓవర్సీస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రీమియర్స్‌లో టాప్ - 10 లిస్టులోకి నేరుగా చేరిపోయింది. అయితే విచిత్రం ఏంటంటే ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన అల్లు అర్జున్ పుష్ప కూడా ఈ స్థాయి వసూళ్లు చేరుకోలేకపోయింది.ఇక తాజాగా భీమ్లానాయక్ సినిమాపై భారీ అంచనాలు ఉండడంతో పాటు అటు దగ్గుబాటి రానా కూడా ఉండడంతో యూఎస్‌లో ఎక్కువ మంది ప్రీమియర్ షో చూసేందుకు ఆసక్తి కనపరిచారు.అయితే కేవలం ప్రీమియర్లతోనే ఈ సినిమా అక్కడ 8. 58 లక్షల డాలర్లను వసూలు చేసింది ఈ సినిమా.


 కాగా దీంతో టాప్ - 10 యూఎస్ ప్రీమియర్లతో 7వ స్థానంలోకి చేరుకుంది. ఇకపోతే ఈ క్రమంలోనే సైరా - భరత్ అనే నేను - అల వైకుంఠపురంలో సినిమాలను కూడా వెనక్కు నెట్టేసింది. ఇక ఇదిలా ఉండగా ఓ వైపు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించేందుకు చాలా సినిమాలు నానా తంటాలు పడుతున్నాయి.అయితే ఇలాంటి టైంలో పవన్ కళ్యాణ్ రిలీజ్ మొదటి రోజు నుంచే రికార్డుల వేట స్టార్ట్ చేశాడు. కాగా మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పనుం కోషియమ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయక్ తెరకెక్కింది. అయితే విచిత్రం ఏంటంటే ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా భీమ్లానాయక్‌పై ఎలాంటి సంచలనాలు లేవు. 


ఇకపోతే అలాంటిది ఇప్పుడు సినిమాకు మొదటి ఆట నుంచి మంచి టాక్ వచ్చింది.ప్రస్తుతం ఓవర్సీస్లో ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తోంది.అయితే ఓవరాల్‌గా చూస్తే భీమ్లానాయక్ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ సినిమా సితార ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించినా...సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహిచారు. అంతేకాకుండా థమన్ సంగీతం అందిచగా.. నిత్యామీనన్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు.సముద్రఖని, మురళి శర్మ రావు, రమేష్ ఇతర కీలక పాత్రలు పోషించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: