పోయిన సంవత్సరం కృతి శెట్టి, శ్రీ లీల, ఫారియా అబ్దుల్ లాంటి ముద్దుగుమ్మలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం మాత్రమే కాకుండా మొదటి సినిమాల తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకొని ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలను దక్కించుకుంటారు, అలా ఈ సంవత్సరం మొదట్లో భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది సంయుక్త మీనన్. ఈ ముద్దుగుమ్మ వాస్తవానికి మొదటగా కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార అనే తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటించింది, కాకపోతే ఈ సినిమా కంటే ముందు భీమ్లా నాయక్ సినిమా విడుదల అయ్యింది. ఒకప్పుడు ఎక్కువగా హీరోయిన్ ల కోసం ముంబై మీద ఆధారపడే టాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఎక్కువ కేరళ ముద్దుగుమ్మ లపై ఇంట్రె స్ట్ చూపిస్తున్నారు, ప్రస్తుతం భీమ్లా నాయక్ సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న సంయుక్త మీనన్ కూడా కేరళ బ్యూటీనే, ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ భీమ్లా నాయక్ సినిమాలో తన నటన తో ప్రేక్షకులను అలరించింది. అలాగే ప్రస్తుతం కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న బింబిసార సినిమాలో హీరోయిన్ నటిస్తోంది, ఈ సినిమా పై కూడా ప్రేక్షకుల్లో మంచి మంచి అంచనాలు నెలకొన్నాయి.
సంయుక్త మీనన్ ఈ సినిమాతో పాటు సితార బ్యానర్ పై వెంకీ అట్లూరి రూపొందిస్తున్న సార్ అనే ఈ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది, ధనుశ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ ని తమిళంలో వాతి అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు, మరి ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలను దక్కించుకుంటున్న కేరళ బ్యూటీ సంయుక్త మీనన్ ఈ సినిమాలతో ఎలాంటి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.