"రాధేశ్యామ్" నుండి బిగ్ అప్డేట్... వీడియో సాంగ్ రిలీజ్?

VAMSI
టాలీవుడ్ హీరోగా తన కెరీర్ ను మొదలు పెట్టిన ప్రభాస్ ఇప్పుడు ఎవరికీ అందనంత ఎత్తులో పాన్ ఇండియా స్టార్ రేంజ్ కు ఎదిగిపోయాడు. ఇది అంతా కూడా జక్కన్న తెరకెక్కించిన బాహుబలి మూవీ విజయం తర్వాతే అని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత నుండి వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం అయిదు ప్రాజెక్టు లు చేస్తున్నాడు. అందులో ఒక మూవీ రాధే శ్యామ్, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. అయితే రాదే శ్యామ్ ఇప్పటికే షూటింగ్ ను కంప్లీట్ చేసుకుని విడుదల కావడానికి సిద్దంగా ఉంది.
అయితే కరోనా కారణంగా థియేటర్ కు అందుంటులో లేకపోవడంతో పలు సార్లు రిలీజ్ తేదీలు ప్రకటించినా విడుదల చేసే దైర్యం చేయలేకపోయింది చిత్ర బృందం. ఈ సినిమా ఒక అద్భుతమైన పీరియాడికల్ ప్రేమకథగా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా పాపులర్ హీరోయిన్  పూజ హెగ్డే నటించింది. రాధాకృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతను భుజాన వేసుకున్నాడు. ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్ళడానికి చిత్ర బృందం ప్రమోషన్ ను మొదలు పెట్టింది. ఇప్పటి వరకు సినిమా నుండి విడుదల అయిన టీజర్, పాటలు ప్రేక్షకుల్ని  అంతగా రంజింప చేయడంలో విఫలం అయ్యాయి.
అందుకే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు అని ఇండస్ట్రీ వర్గాల నుండి సమాచారం అందుతోంది. కాగా ఇప్పుడు మరో అప్డేట్ ను ప్రభాస్ అభిమానులకు అందించడానికి సిద్దం అయింది మూవీ టీమ్. ఈ సినిమా నుండి "ఈ రాతలే ...." అంటూ సాగే పాట వీడియో సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఇంకాసేపట్లో ఈ సాంగ్ యొక్క పూర్తి వీడియోను విడుదల చేయనుంది. సరిగ్గా ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ముహూర్తం పెట్టింది చిత్ర బృందం. మరి వీడియో సాంగ్ అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: