భీమ్లా నాయక్: రానా "డేనియల్ శేఖర్" గా ఇరగదీశాడుగా...
సినిమా ఓవరాల్ గా బాగుంది. కానీ ఎక్కువగా రానా పేరే వినిపిస్తోంది. ఇందులో రానా డేనియల్ శేఖర్ అనే మాజీ ఆర్మీ ఆఫీసర్ పాత్రను చేశాడు. ఈ పాత్రకు రానానే ఎందుకు తీసుకున్నారు అన్నది తెలియాలంటే ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఒక మనిషికి ఏదయితే నచ్చదో దానినే కెలికితే ఎలా ఉంటుందో అన్నది ఈ సినిమాలో స్పష్టంగా చూపించారు డైరెక్టర్ సాగర్ కె చంద్ర. సినిమా మొదట్లో డేనియల్ శేఖర్ (రానా) డ్రింక్ చేస్తుండగా భీమ్లా నాయక్ (పవన్ కళ్యాణ్) అరెస్ట్ చేసిన తీరు డేనియల్ శేఖర్ అహాన్ని దెబ్బ తీస్తుంది. ఇక అది మొదలు భీమ్లా నాయక్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి డేనియల్ శేఖర్ వేసే ప్రతి అడుగు, వాళ్లిద్దరూ కలిసే ప్రతి సన్నివేశం ఆసక్తిగా ఉంది.
సినిమా మొత్తంలో పవన్ కన్నా రానా నటనే బాగా ఎలివేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత వివిధ భాషలలో రానాకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. సినిమా ఎలాగు హిట్ అయింది కాబట్టి ఇక కలెక్షన్ రికార్డుల పైనే గురి ఉండనుంది. ఇక ఈ సినిమా తర్వాత రానాను డేనియల్ శేఖర్ గా మరి కొంతకాలం నిలిచిపోతాడు.