పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుపాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ క్రేజీ మల్టీస్టారర్ మూవీ 'భీమ్లా నాయక్'. మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం సినిమాకి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, రఘు బాబు, మురళి శర్మ, సముద్రఖని, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ని అందించారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాదులోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించారు.
ఇక ఈ ప్రీ రిలీజ్ వేడుకకు నటీనటులు మరియు సిబ్బంది కూడా అంతా హాజరయ్యారు. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిథిగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. అయితే ఈ వేడుక ఎంతో భారీగా జరిగినప్పటికీ అందులో మాత్రం హీరోయిన్ నిత్యామీనన్ ఎక్కడా కనిపించలేదు. దీంతో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నిత్యామీనన్ ను ఎందుకు దూరంగా ఉంచారని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లోని ఆహా కోసం 'ఇండియన్ ఐడల్' తెలుగు కర్టెన్ రైజర్ కోసం నిత్యామీనన్ హాజరైంది. కానీ ఇంత భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. అది కూడా పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర హీరో సినిమాలో హీరోయిన్గా నటించి ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రం రాలేదు.
మరోవైపు కనీసం సోషల్ మీడియా లోనైనా భీమ్లా నాయక్ సినిమా గురించి ఒక్క మాటకూడా మాట్లాడకపోవడం ఇప్పుడు కొన్ని అనుమానాలకు దారి తీస్తోంది. దీంతో భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ తో నిత్యామీనన్ కి ఏవైనా విభేదాలు ఉండొచ్చనే టాక్ కూడా నడుస్తోంది. కానీ మరో వైపు చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నిన్న జరిగిన ఈవెంట్ లో నిత్యామీనన్ గురించి మాట్లాడటం చూస్తుంటే అది నిజం కాదేమో అనిపిస్తుంది. ఇంకోవైపు నిత్యామీనన్ ఈవెంట్కు రాకపోవడానికి ఆమె ఒక వెబ్ సిరీస్ షూటింగ్లో బిజీగా ఉందని.. అందుకే రాలేదని చెబుతున్నారు. ఏదేమైనా భీమానాయక్ ఈవెంట్కు నిత్యామీనన్ ఎందుకు హాజరు కాలేదు అనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదనే చెప్పాలి...!!