బాలయ్య కోసం ఆ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్..?

Anilkumar
నందమూరి బాలయ్య బాబు “అఖండ” బ్లాక్ బస్టర్  అయిన సంగతి తెలిసిందే.అయితే బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలయ్య బాబు కెరీర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించింది.ఇక అంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ విజయాలు సాధించటంతో అఖండ తో హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా తర్వాత ప్రస్తుతం బాలయ్య బాబు అనిల్ రావిపూడి దర్శకత్వం లో మరోసారి మాస్ తరహా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా  ఇటీవలే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ కావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.


కాగా తెలంగాణ ప్రాంతంలో సిరిసిల్ల జిల్లాలో ఫైట్ తో షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అయితే ఇదిలా ఉండగా  ఇప్పుడు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడి సరికొత్త నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.అసలు మేటర్ లోకి వెళ్తే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ నీ తీసుకోవడానికి రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే మరోపక్క బాలకృష్ణ మాత్రం తమన్ తో అయితే బాగుంటుంది అని డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నట్లు వీరిద్దరిలో ఒకరిని కన్ఫామ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.


ఇక తాజా సమాచారం ప్రకారం చాలావరకు అనిల్ రావిపూడి  అనిరుద్ కే అవకాశం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.అయితే  టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్క పరాజయం కూడా లేని డైరెక్టర్ గా అనిల్ రావిపూడి గ్రాఫ్ ఉండటంతో  బాలయ్య బాబు సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలతో పాటు కమర్షియల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో బాలయ్య ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: