టాలీవుడ్ లో రచయితగా దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు త్రివిక్రమ్. మాటల మాంత్రికుడు గా గురూజీ గా ఎన్నో బిరుదులను ను సొంతం చేసుకున్న
త్రివిక్రమ్ తాను దర్శకత్వం వహించే సినిమాల విషయంలో తీసుకునే జాగ్రత్తలు అంతా ఇంతా కాదు. తన ప్రతి సినిమాలో ఒకే రకమైన స్టైల్ ఉపయోగిస్తూ ఆయా సినిమాలను ప్రేక్షకులకు నచ్చే విధంగా చేస్తూ అందరినీ ఎంతగానో అలరిస్తూ ఉంటాడు. ఆ విధంగా
త్రివిక్రమ్ రచయితగా ఓ సినిమాకు వ్యవహరించడం అంటే చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది.
దర్శకుడిగా మారిన తర్వాత రచయితగా కే సినిమాకు చేయవలసిన అవసరం రాలేదు కానీ పవన్
కళ్యాణ్ సినిమాకు ఆయన రచయితగా చేయడం చేయాల్సి రావడం విశేషం. ఈ నేపథ్యంలో భీమ్లా
నాయక్ చిత్రానికి ఆయన రచయితగా వ్యవహరించాడు. పవన్
కళ్యాణ్ తో ఆయనకు ఉన్న అనుబంధం రీత్యా ఈ సినిమాకు ఆయన రచయితగా చేయవలసి వచ్చింది. అయితే ఏ సినిమాకు ఆయన ఏ విధమైన పని చేసినా కూడా ఆ చిత్రానికి తప్పకుండా
త్రివిక్రమ్ మార్క్ క్లాస్ టచ్ ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చేది కూడా ఈ విషయమే.
అలాంటిది ఈ
సినిమా విషయంలో
త్రివిక్రమ్ యొక్క క్లాస్ టచ్ మిస్ అవుతుందని కొంతమంది ప్రేక్షకులు చెబుతున్నారు. ఏ
డైరెక్టర్ స్టైల్ ఆ
డైరెక్టర్ కి ఉంటుంది కాబట్టి
త్రివిక్రమ్ డైరెక్టర్ కాదు కాబట్టి ఈ సినిమాకు ఆయన టచ్ ఎలా ఉంటుందని కొంతమంది చెబుతుండగా అన్నీ దగ్గరుండి చూసుకున్నప్పుడు
త్రివిక్రమ్ క్లాస్ టచ్ ఉండకపోవడం ఏంటి అని కొంతమంది వాదిస్తున్నారు. టైలర్ చూసి ఎన్నో అనుమానాలను తెప్పిస్తున్న కూడా ఈ చిత్రం తప్పకుండా
త్రివిక్రమ్ మార్క్ స్టైల్ ఉండబోతుంది అని అంటున్నారు.
ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఈ రోజు ప్రీ రిలీజ్
ఈవెంట్ ను జరుపుకోనుంది.
రానా మరో కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.