బిగ్ బాస్ హోస్ట్ గా మరో స్టార్ హీరో.. ఎవరంటే?

praveen
ప్రేక్షకులను అలరించేందుకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నప్పటికీ అటు బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో గా ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్ బాస్ కి మాత్రం ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఇక బిగ్బాస్ వస్తుంది అంటే చాలు అటు ప్రేక్షకులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి వీక్షిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా వెళ్లే సినీ సెలబ్రిటీల మధ్య గొడవలు.. కాంట్రవర్సీలు కూడా బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంటాయ్. ఇక ఈ కాంట్రవర్సీ లే బిగ్బాస్ కార్యక్రమానికి ఊహించని రీతిలో టాప్ రేటింగ్ తెచ్చి పెడుతూ ఉంటాయి అని చెప్పాలి.

 కేవలం ఒక్క భాషలో కాదు దాదాపు అన్ని భాషలలో కూడా బిగ్ బాస్ కార్యక్రమం సూపర్హిట్ అయింది. మొదట హిందీలో బిగ్బాస్ కార్యక్రమం ప్రారంభం అవ్వగా.. ఆ తర్వాత తమిళ తెరపై బిగ్బాస్ ప్రసారం అయింది. ఇక ఇప్పుడు తెలుగు తెరపై కూడా ఈ సినీ సెలబ్రిటీ రియాలిటీ షో ఎంతో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే బిగ్బాస్ కార్యక్రమాన్ని కేవలం గంట ఎపిసోడ్ గా కాకుండా 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయించారు నిర్వాహకులు. అయితే బుల్లితెరపై కాకుండా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతుంది.

 అటు తెలుగు బిగ్ బాస్ తో పాటు తమిళ బిగ్ బాస్ కార్యక్రమం కూడా హాట్ స్టార్ లో రాబోతుంది. అయితే ఇలా బిగ్ బాస్ ఓటిటి సీజన్ నుంచి ఎన్నో ఏళ్ల నుంచి హోస్ట్ గా కొనసాగుతున్న కమలహాసన్ తప్పుకున్నాడు. దీంతో కొత్త హోస్ట్ గా ఎవరు వస్తారా అన్న చర్చ జరుగుతున్న సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు కొత్త హోస్ట్గా రాబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రాబోతుందట. ఇటీవలే మానాడు అనే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు శింబు. ఇక ఈ సినిమా తెలుగులో కూడా రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. మరి బిగ్ బాస్ హోస్ట్ గా శింబు ఎలా అలరిస్తాడు అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: