సుకుమార్ తో చిరంజీవి ప్రాజెక్ట్.. సినిమా కాదు..!

Satvika
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల తర్వాత సినిమాలలొకి రీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి గ్యాప్ లేకుండా సినిమాలను చేస్తూ వస్తున్నారు.. ఇప్పటికే ఆయన రెండు సినిమాలు విడుదల అయ్యి మంచి హిట్ ను అందుకున్నాయి. ఇప్పుడు కూడా 4 సినిమాల లో నటిస్తూ బిజిగా ఉన్నారు. ఆయన స్పీడ్ చూస్తె యంగ్ హీరోలు కూడా షాక్ అవుతున్నారు. అంతగా చిరు సినిమాలను చెస్తున్నారు.ప్రస్తుతం ఆయన నటించిన 'ఆచార్య' సినిమా ఏప్రిల 29న విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా ఇప్పుడు విడుదల కు సిద్ధంగా ఉంది.


ఇది ఇలా ఉండగా.. మలయాళ సినిమా 'లూసిఫర్' రీమేక్ లో నటిస్తున్నారు చిరు. మోహన్ రాజా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి 'గాడ్ ఫాదర్' అనే టైటిల్ ఖరారు చేశారు.మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ 'భోళా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు.ఈ సినిమాలో చిరు సరసన తమన్నా నటించగా, సిస్టర్ పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు అన్నీ సినిమా పై అంచనాలను పెంచుతున్నాయి.. వెంకీ కుదుమల డైరెక్షన్లో మరో, బాబీ డైరెక్షన్లో మరో సినిమాను చేస్తున్నారు.


ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు లెక్కల మాస్టర్ తో మరో సినిమాను చేస్తున్నారు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా వెల్లదించారు. అందుకు సంబంధించిన ఒక సినిమాను కూడా సుక్కు విడుదల చేశారు. సుకుమార్ డైరెక్షన్లో సినిమా అంటే మెగా అభిమానుల ఆనందానికి అవదులు లేవని చెప్పాలి. ఆ సినిమా కూడా పక్కా హిట్ అవుతుందని అభిప్రాయ పడుతున్నారు. కాగా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ బయట చక్కర్లు కోడుతుంది.. వీరిద్దరు కలిసి సినిమా చేయలేదట. ఓ కమర్షియల్ యాడ్ అని తెలుస్తోంది. దానికోసం సుకుమార్ మెగాస్టార్ ను కలిశారు.. మరి కొద్ది రోజుల్లో ఈ విషయం పై  క్లారిటీ రానుంది. చిరు యాడ్స్ లో కనిపించి చాలా రోజులు అవుతుంది. ఇప్పుడు మళ్లీ కమర్షియల్ యాడ్స్ లో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇటు సినిమాలు అటు యాడ్స్ లతో ఫుల్ బిజిగా మారనున్నారు చిరు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: