కొన్ని సంవత్సరాల క్రితం వరకు స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవారు, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. స్టార్ స్టేటస్ ఉన్న హీరోలు కూడా సినిమాలు మాత్రమే కాకుండా కూడా ఓటిటి కంటెంట్ లో, టీవీ షో లకు హోస్ట్ గా వ్యవహరించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అందులో భాగంగా ఇప్పటికే అనేక మంది టాలీవుడ్ హీరోలు అనేక వెబ్ సిరీస్ లలో నటించారు, అలాగే టీవీ షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరించారు. సినిమాలతో మాత్రమే కాకుండా, ఓటిటి కంటెంట్ తో, టీవీ షో లతో కూడా ప్రేక్షకులను అలరించిన హీరో లలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకరు. నాగార్జున ఇప్పటికే మీలో ఎవరు కోటీశ్వరులు టీవీ షో కు హోస్ట్ గా వ్యవహరించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించాడు, అది మాత్రమే కాకుండా బిగ్ బాస్ తెలుగు సీజన్ 3, 4 , 5 లకు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.
ఇలా సినిమాలతో ఎన్నో సంవత్సరాల పాటు ప్రేక్షకులను అలరించిన నాగార్జున ప్రస్తుతం సినిమాలతో పాటు టీవీ షో ల ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నాడు, ఇలా ఇప్పటి వరకు సినిమాలతో, టివి షో లతో ప్రేక్షకులను అలరించిన నాగార్జున మరికొన్ని రోజుల్లో ఓటిటి ద్వారా కూడా ప్రేక్షకులను అలరించబోతున్నారు, తెలుగు ఓటిటి బిగ్ బాస్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు. ఇలా ఇప్పటికే కొన్ని రోజుల క్రితం విడుదలైన బంగార్రాజు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నాగార్జున, ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఘోస్ట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు, ఇలా ఘోస్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్న నాగార్జున ఓటిటి బిగ్ బాస్ కు కూడా హోస్ట్ గా వ్యవహరించబోతున్నాడు, ఇలా నాగార్జున సినిమాలతో, ఓటిటి బిగ్ బాస్ తో ఫుల్ స్పీడ్ మీదున్నాడు.