శ్రీవల్లి పాటపై.. బాబు మోహన్ అదిరే డాన్స్.. చూసారా?

praveen
అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా అంతటా భారీ వసూళ్లను సాధించింది. కేవలం పుష్ప సినిమా మాత్రమే కాదు. ఇక ఈ సినిమాలోని అన్ని పాటలు కూడా ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి అని చెప్పాలి. క్లాస్ ప్రేక్షకుల దగ్గర నుంచి మాస్ ప్రేక్షకుల వరకు ఇక పుష్ప సినిమా పాటలు ఆకట్టుకున్నాయ్. మరీ ముఖ్యంగా శ్రీవల్లి పాట సెన్సేషన్ సృష్టిస్తోంది.

 పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ శ్రీవల్లి పాట ఆకర్షించింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. దీంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలే కాదు క్రికెటర్లు సైతం శ్రీవల్లి పాట పై డాన్స్ చేసి ఇక ఆ వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేశారు. ఇలా భారత్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా శ్రీవల్లీ మేనియా  నడిచింది.  ఇక ఇప్పుడు పుష్ప లోని శ్రీవల్లి పాట పై కమెడియన్ రాజకీయ నాయకుడు బాబు మోహన్ తనదైన శైలిలో డాన్స్ చేశారు. ఇక ఇది చూసిన అభిమానులు అందరూ తెగ మురిసిపోతున్నారు అని చెప్పాలి.

 ప్రస్తుతం ఈ టీవీ లో శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం లో భాగం గా ప్రతి వారం కూడా సరికొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది. ఒకప్పుడు సినిమాల్లో వైవిధ్యమైన  పాత్రలో నటించి స్టార్ కారెక్టర్ ఆర్టిస్ట్ గా వెలిగిన సీనియర్లు అందర్నీ కూడా శ్రీదేవి  డ్రామా కంపెనీ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ లుగా పిలిచారు. ఈ క్రమం  లోనే  ఇక బాబు మోహన్ మరో సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో కలిసి డాన్స్ చేశాడు. బాబు మోహన్ అదిరిపోయే స్టెప్పులు వేసిన తీరు అందరినీ ఆకర్షించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: