బిగ్ బాస్ లో ఛాన్స్ వచ్చినా.. వెళ్ళలేను : స్టార్ సింగర్
అయితే ఇందులో గత బిగ్బాస్ సీజన్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ తో పాటు కొత్తవారిని కూడా హౌస్ లోకి పంపించేందుకు సిద్ధమయ్యారు అన్నది ప్రస్తుతం వినిపిస్తున్న టాక్.. అంతే కాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లపోతున్నారు అంటూ ఎంతో మంది పేర్లు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ స్టార్ సింగర్ గీతామాధురి బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ కూడా హౌస్ లోకి వెళ్తున్నారు అని అంటున్నారు. అయితే తనకు మాత్రం బిగ్ బాస్ హౌస్ లో ఛాన్స్ వచ్చినా వెళ్ళలేను.. ఎందుకంటే కెరియర్ను ఫ్యామిలీని చూసుకోవాలి కదా అంటూ గీతామాధురి చెప్పుకొచ్చారు.
ఈ గతంలోనే బిగ్ బాస్ లోకి వెళ్ళిన సమయంలో టైటిల్ మిస్ అయింది.. ఇప్పుడు వెళ్లిన టైటిల్ కొట్టలేను. ఎందుకంటే నేను సెకండ్ హ్యాండ్ అయిపోతాను కదా. బిగ్ బాస్ హౌస్ లో కేవలం కొత్త టాలెంట్ కు మాత్రమే టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే కంటెస్టెంట్ కి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చింది ఈ స్టార్ సింగర్. బిగ్బాస్ కెమెరాలు ఎప్పుడూ మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాయి. అందుకే మీలా మీరు ఉండండి. మహా అయితే ఒక వారం నటించగలరు ఏమో.. కానీ ఆ తర్వాత ఆటోమేటిక్ గా మీలా ప్రవర్తించడం మొదలుపెడతారు. ఇక ప్రతి మాట ఆచితూచి మాట్లాడండి.. ఎందుకంటే కాలు జారితే వెనక్కి తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేం అంటూ ఈ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ హౌస్ లోకి వెళ్లి పోయే కంటెస్టెంట్ కి సలహాలు ఇచ్చింది.