ఇటీవల బాక్సాఫీస్‌ని షేక్ చేసిన పుష్ప చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఎంతటి సూపర్ డూపర్ హిట్ అయ్యిందో మనందరికీ తెలిసిందే.ఇక ఈ సినిమా అంతటా అశేష ప్రేక్షకాదరణ పొందింది.అంతేకాదు ఈ సినిమాలోని సన్నివేశాలు, సాంగ్స్ సోషల్ మీడియాని షేక్ చేశాయి.ఇక పుష్ప చిత్రం ఎంతటి విజయం సాధించిందో ప్రేత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ నటించారు.కాగా ఈ
సినిమా సక్సెస్ దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కు వెంటనే పార్ట్ 2 పై దృష్టి పెట్టేలా చేసింది. అంతేకాకుండా ఈ నేపథ్యంలో పుష్ప సెకండ్ పార్ట్ అయిన “పుష్ప: ది రూల్” పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ చిత్ర బృందంతో మాట్లాడడానికి ఒక మీటింగు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.అయితే చిత్ర దర్శకుడు సుకుమార్ నిర్మాతలు మరియు ముఖ్య నటీనటులు కూడా ఈ మీటింగ్ లో పాల్గొన్నట్లు సమాచారం.అయితే ఈ మీటింగ్‌లో మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమాలు ఎట్టిపరిస్థితుల్లోనూ డిసెంబర్ కి విడుదల చేయాలని చెప్పుకొచ్చారు. కాగా ఈ నేపథ్యంలోనే ఈ మార్చి మధ్యలో నుంచి షూటింగ్ మొదలు
పెట్టి నాలుగు నెలల్లో షూటింగ్‌ని పూర్తి చేయమని సుకుమార్‌కి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మరోవైపు వివిధ భాషల్లో విడుదలైన పుష్ప సినిమా హిందీలో కూడా భారీగా హిట్ అయింది. చిత్ర బృందం పుష్ప సెకండ్ పార్ట్ తో హిందీ ప్రేక్షకులను కూడా దృష్టిలో పెట్టుకుని రిలీజ్ ప్లాన్ చేస్తోంది. ఇక ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప' మూవీ దేశ వ్యాప్తంగా సెన్సేషన్ అయింది. అయితే ఈ సినిమాలోని 'తగ్గేదేలే' అనే డైలాగ్ ఓ వైపు పాజిటివ్‌గానూ, మరోవైపు నెగిటివ్‌గానూ వెళ్తోంది.... అంతేకాదు ఈ డైలాగ్పై పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేయగా.. టీఆర్ఎస్ నేత కూడా ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది.కాగా ఈ సినిమా క్రేజ్‌ను వాడుకొని కొన్ని సంస్థలు తమకు కావాల్సిన ప్రచారాలు చేసుకుంటున్నాయి.