వావ్: కళ్యాణ్ రామ్ పటాస్-2 మూవీ ప్రారంభం.. డైరెక్టర్ ఎవరంటే..?

Divya
నందమూరి కళ్యాణ్ రామ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో పటాస్ సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.. ఈ సినిమా ఎంతో ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఇప్పుడు తాజాగా పటాస్ -2 కూడా మంచి మూవీ ఉండబోతోందని డైరెక్టర్ కన్ఫామ్ చేయడం జరిగింది.. వాటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం చూద్దాం.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితలు ఎంతోమంది సక్సెస్ అయిన వారు ఉన్నారు.. అలా రచయిత నుంచి డైరెక్టర్ లుగా మారిన వాళ్లు కూడా ఎంతోమంది ఉన్నారు. అలాంటివారిలో డైరెక్టర్ కొరటాల శివ, త్రివిక్రమ్, సుకుమార్ వంటివారు ఉన్నారు. ఇక ఇలాంటి వారితో సమానంగా సూపర్ హిట్స్ మూవీ అందుకుంటున్న రచయిత, డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు. ఆయన పటాస్ సినిమాతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని చెప్పవచ్చు.. ఈ సినిమాలో హీరో కళ్యాణ్ రామ్ నటించారు. దీంతో ఇక ఈ డైరెక్టర్ వరుసగా స్టార్ హీరోలను డైరెక్ట్ చేసే అవకాశాలు అందుకున్నారు. ఇక పటాస్ సినిమా తర్వాత.. సుప్రీమ్, f-2, రాజా ది గ్రేట్, సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలు తెరకెక్కించారు.

ప్రస్తుతం వరుణ్ తేజ్, వెంకటేష్, మెహరీన్, తమన్నాతో f-3 మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ఈ ఏడాది మే నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇక తన మొదటి సినిమాకి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో మరొకసారి సినిమా చేసేందుకు ఇష్టపడలేదు అన్నట్లుగా అప్పట్లో వార్తలు వినిపించాయి.. అయితే కానీ  వారిద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవని.. అసలు గ్యాప్ వచ్చే ప్రసక్తేలేదని క్లారిటీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే పటాస్ సినిమా తర్వాత ఇద్దరూ కలిసి ఒక మూవీని చేయాలనుకున్నప్పటికీ  కుదరకపోవడంతో ఒప్పుకోలేదు అని తెలియజేశాడు.. అయితే తాజాగా పటాస్2 ఉంటుందని తెలియజేశాడు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: