భీమ్లా నాయక్ : ఆ కుర్ర హీరోకి తలనొప్పయిందిగా ?

Purushottham Vinay
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భీమ్లా నాయక్ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ అవుతుంది. అయితే ఈ సినిమా రిలీజ్ ఒక యంగ్ హీరోకి తలనొప్పిగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ గత ఏడాది వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అందులో ఒకటి మల్టీస్టారర్ సినిమా. అయితే ఈ రెండు సినిమాలు కూడా శర్వాకు ఆశించిన ఫలితాన్ని మాత్రం అసలు అందించలేకపోయాయి.దీంతో ఈ సారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని వారు నమ్ముకున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా `ఆడవాళ్లు మీకు జోహార్లు`. ఈ సినిమాకు కిషోర్ తిరుమల దర్శకత్వం వహించారు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి నిర్మించారు.ఇప్పటికే భారీ క్రేజ్ నెలకొన్న ఈ సినిమా ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 



శర్వా రఫ్మిక ఫస్ట్ కాంబినేషన్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే కథ కథనాలు శర్వాకు అండగా వెటరన్ హీరోయన్ లు వెరసి సినిమా పై ఓ రేంజ్ లో హైప్ అనేది క్రియేట్ అయింది. రిలీజ్ దగ్గర పడుతున్న సమయంలో మేకర్స్ ప్రచార పర్వాన్ని హోరెత్తించారు. కొత్త పోస్టర్ లు ట్రైలర్ రిలీజ్ ఇంకా అలాగే మీడియా ఇంటరాక్షన్ లతో సినిమాకు ప్రచారం మొదలుపెట్టారు. అంతా సవ్యంగానే సాగుతుందని అనుకుంటున్న తరుణంలో భీమ్లా నాయక్ రూపంలో ఈ సినిమాకి టీమ్ కి బిగ్ షాక్ తగిలింది.రాదనుకున్న `భీమ్లా నాయక్` సినిమా సడన్గా రంగంలోకి దిగడం శర్వానంద్ టీమ్ ని కలవరానికి గురిచేసింది.



తెలుగులో భారీ క్రేజ్ వున్న హీరో పవన్ కల్యాణ్ నటించిన సినిమా కావడం.. తనకి తోడు రానా దగ్గుబాటి నిత్యామీనన్ సంయుక్త మీనన్ కూడా ఈ సినిమాలో నటించడం... అలాగే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాటలు ఇంకా స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా కథా మార్పుల్లో కీలక పాత్ర పోషించి ప్రాజెక్ట్ కి వెన్నుదన్నుగా నిలవడం వంటి కారణాలతో శర్వా టీమ్ కొంత కంగారు పడింది.దీంతో పాపం ఈ యంగ్ హీరోకు పెద్ద తలనొప్పి మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: