ఇక తాజాగా థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమతులు మంజూరు చేస్తూ నైట్ కర్ఫ్యూని కూడా ఎత్తేస్తూ గురువారం ప్రభుత్వం ప్రకటించింది. అయితే పెద్ద మూవీస్ కి టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుని కల్పించే జీవోని మాత్రం ప్రభుత్వం ఇంకా ప్రకటించలేదు.ప్రత్యేకంగా దీనిపై భేటీ జరిగినా కాని ఇంత వరకు ఏపీ ప్రభుత్వం.. సంబంధిత శాఖ ఎలాంటి నిర్ణయానికి మాత్రం రాలేదు. అయితే ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం `భీమ్లా నాయక్ ` విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 25 వ తేదీన ఈ సినిమాని వరల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.`వకీల్ సాబ్` సినిమా తరువాత పవన్ నుంచి వస్తున్న మాస్ మసాలా యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో పవర్ స్టార్ పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక 100 శాతం ఆక్యూపెన్సి కావడంతో ఈ సినిమాతో పవన్ కలెక్షన్స్ పరంగా మెరుపులు మెరిపించడం ఖాయం.
ఇక ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ లిరికల్ వీడియోలతో సినిమాపై అంచనాలు అనేవి స్కై హైకి చేరుకున్నాయి. రానా నిత్యామీనన్ ఇంకా సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించడం.. యస్ తమన్ అందించిన సంగీతం సినిమాకు మరింత హైప్ ని తీసుకొచ్చింది.ఇక ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఈ నెల 21వ తేదీ న భారీ స్థాయిలో నిర్వహించబోతున్నారు. యూసఫ్ గూడాలోని పోలీస్ గ్రౌండ్స్ లో భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బాగా ఏర్పాటు చేస్తున్నారు.ఇందుకు సంబందించిన ఏర్పాట్లు అన్నీ కూడా చకచకా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఈ ఈవెంట్ కోసం యావత్ సినిమా ఇండస్ట్రీ తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.