కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నటిడిగా, విద్యా సంస్థల అధినేత గా తనదైన గుర్తింపు తెచ్చుకున్న మోహన్ బాబు తాజాగా సన్ ఆఫ్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్రల్లో నటించాడు, ఈ సినిమా ఫిబ్రవరి 18 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది, ఈ సినిమా విడుదల సందర్భంగా మాట్లాడుతూ మంచు మోహన్ బాబు తనపై ట్రోల్స్, మీమ్స్ చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించాడు. ట్రోల్స్, మీమ్స్ అనేవి నవ్వుకునేలా, సరదాగా ఉండాలి తప్ప ఎదుటి వ్యక్తులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు అని, సాధారణంగా నేను ఎక్కువగా ట్రోల్స్, మీమ్స్ పట్టించుకోను ఎవరైనా నాకు పంపిస్తే చూస్తాను, నిజానికి అయితే ట్రోల్స్, మీమ్స్ ను పట్టించుకోకూడదు.
కాకపోతే అవి హద్దులు మీరు తున్నాయి, అలాంటి వాటిని చూసినప్పుడు చాలా బాధగా అనిపిస్తుంది. ఎదుటి వ్యక్తులను ట్రోలింగ్ చేయొచ్చు లేదో నాకు తెలియదు కానీ, వ్యగ్యంగా ట్రోలింగ్ చేయడం మాత్రం చాలా బాధాకరం అని మోహన్ బాబు తెలియజేశారు. అలాగే ఇద్దరు హీరోలు యాబై నుంచి వంద మందిని ట్రోలింగ్ చేయడాని నియమించుకుని ట్రోల్ చేయిస్తున్నారు, ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు. ఆ వ్యక్తులను ప్రకృతి గమనిస్తూనే ఉంటుంది, ప్రస్తుతం వారికి బాగానే ఉంటుంది, కానీ ఏదో ఒకరోజు ఆ వ్యక్తులు శిక్షను అనుభవిస్తారు. ఆ సమయంలో వారి వెనక ఎవరూ ఉండరు, వారికి ఎవరు సహాయం చేయరు అని మోహన్ బాబు అన్నారు. మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటించిన సన్ ఆఫ్ ఇండియా సినిమా మొదటగా ఓటిటి కోసం నిర్మించారు, ఈ సినిమా రన్ టైమ్ ఒక గంట 29 నిమిషాలు మాత్రమే. ఈ మూవీ ని శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించగా, ఈ మూవీ కి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించారు.