బాషా సినిమాని మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా..??
మెగాస్టార్ చిరంజీవి సినీ ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా గ్యాంగ్ లీడర్.. ఈ సినిమాకు విజయ బాపినీడు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం 1991లో విడుదలై.. ఎన్నో రికార్డులను సృష్టించింది. అయితే చిరంజీవికి మాస్ ఫాలోయింగ్ రెండింతలు చేసింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనే చెప్పాలి మరి. ఇక వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమాని చేయాలని చిరంజీవి ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలోనే విజయబాపినీడు డైరెక్షన్లో బిగ్ బాస్ సినిమాను చిత్రీకరిస్తున్నారు.
అయితే అదే సమయంలో ఓ మూవీ షూటింగ్ కోసం చెన్నైలో ఉండగా.. డైరెక్టర్ సురేష్ కృష్ణ బాషా సినిమా కథని చిరంజీవికి చెప్పారంట. ఇక ఈ స్టోరీ చిరంజీవికి బాగా నచ్చిందంట. అంతేకాదు.. చిరంజీవి ఈ సినిమాని బిగ్ బాస్ పేరుతో తెలుగులో తెరకెక్కించాలని అనుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీకి తెలుగు హక్కులను కొనుగోలు చేయమని తన బావమరిది అల్లు అరవింద్‌కు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ ప్రొడ్యూసర్‌తో బేరానికి దిగారట.. అయితే అతను తెలుగు రైట్స్ కోసం 40 లక్షల రూపాయలు డిమాండ్ చేయగా.. అల్లు అరవింద్ 25 లక్షల రూపాయలకు అడగడంతో బేరం కుదరక పోవడంతో చిరంజీవి ఈ సినిమాను వదులుకున్నారు.