గుంటూరులో డిజే టిల్లు సక్సెస్ మీట్ సందడి..

frame గుంటూరులో డిజే టిల్లు సక్సెస్ మీట్ సందడి..

Satvika
ఈ ఏడాది లో ఓ మాదిరిగా ఆడిన చిన్న సినిమాల విషయానికి వస్తే నాగార్జున సీక్వెల్ మూవీ బంగర్రాజు ఎంత హిట్ ను అందుకుందొ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరంలేదు. ఈ సినిమా తర్వాత రీసెంట్ గా వచ్చిన చిత్రం డిజే టిల్లు.. సిద్దు జొన్నలగడ్డ, నేహశెట్టి జంటగా నటించారు. విమల్ కృష్ణ డైరెక్షన్లో ఈ సినిమా రూపొందిన సంగతి తెలిసిందే.. ఫిబ్రవరి 12 న గ్రాండ్ గా విడుదల అయిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే భారీ విజయాన్ని అందుకుంది..రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈమూవీకి కథ. స్క్రీన్ ప్లై హీరో సిద్దూనే అందించారు. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి..


బాక్సాఫిస్ వద్ద మంచి రికార్డులను అందుకున్న ఈ సినిమా సక్సెస్ ను చిత్ర యూనిట్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా చిత్రబృందం హీరో, హీరోయిన్లు తో తదితర సభ్యులతో సక్సెస్ మీట్ ఎంజాయ్ ఏర్పాటు చేశారు.రీసెంట్ గా గుటూరు వెళ్ళిన టీమ్ అక్కడ ఓ థియేటర్ లో ప్రేక్షకులను కలుసుకున్నారు. వాళ్ళతో నవ్వుల్ని పంచుకుంటున్నారు. గుంటూరులో సినిమా హీరో ,హీరోయిన్లు థియెటర్ల లోకి రావడం తో అందరూ ఆనందంతో కేరింతలు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. సినిమా చాలా బాగుంది. మంచి కామెడీ ఉందని ప్రేక్షకులు అన్నారు.


థియేటర్ లో ప్రేక్షకుల తో కలసి చూసిన హీరో సిద్దు జొన్నలగడ్డ, హీరోయిన్ నేహా శెట్టి, దర్శకుడు విమల్ ఆడియన్స్ మధ్య కేక్ కట్ చేసి సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు.. అనంతరం టిల్లు గాడు చేసే అల్లరి మీతో కలసి చూడటం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. మీనవ్వులు కామెంట్స్ ని చాలా బాగా ఎంజాయ్ చేసాను హీరో, డైరెక్టర్ అన్నారు. ఇక హీరోయిన్ కూడా సినిమా బాగుందని అన్నారని అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొత్తానికి గుంటూరు లో వీళ్ళు చేసిన సందడి అందరినీ తెగ ఆకట్టుకుంది..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: