కళావతి న్యూ రికార్డ్ : సౌత్ లోనే ఫస్ట్ & ఫాస్ట్ ?
పాటలో విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13 వ తేదీన విడుదలకావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతి పండగకి రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మరోవైపు భీమ్లా నాయక్ ఇంకా ప్రభాస్ రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నట్టు ప్రకటించాయి. ఈ క్రమంలో 'సర్కారు వారి పాట' సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఆ సినిమాలు కరోనా వైరస్ థర్డ్ వేవ్ కారణంగా విడదలను పోస్ట్‌పోన్ అయ్యాయి. ఇక ఈ పాట విషయానికి వస్తే నిన్న విడుదల చేసిన ఈ పాట ఇప్పటి వరకు 16 మిలియన్ వ్యూస్ తో బాగా దూసుకుపోతుంది. సౌత్ ఇండియాలోనే మొదటి 24 గంటల్లో ఇన్ని వ్యూస్ ఏ పాటకు కూడా రాలేదు.ఇది నిజంగా ఆల్ టైం రికార్డ్ అని చెప్పాలి.
ఇంకా 806k లైక్స్ సాధించి టాలీవుడ్ లోనే మొదటి 24 గంటల్లో ఏ పాటకి రాని లైక్స్ సంపాదించి రికార్డు సృష్టించింది.ట్రెండింగ్ లో నెంబర్ వన్ అయ్యింది. ఇక ఈ పాటలో సూపర్ స్టార్ మహేష్ బాబు, మహానటి కీర్తి సురేష్‌ల జోడికి మహేష్ బాబు అభిమానుల నుంచి సూపర్ రెస్సాన్స్ వస్తోంది.