'బన్నీకి ఫ్యాన్ అయిపోయా'.. పుష్పరాజ్ పై బాలీవుడ్ దిగ్గజ నటుడు ప్రశంసలు..!

Anilkumar
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ 'పుష్ప'. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటించగా.. స్టార్ హీరోయిన్ సమంతా స్పెషల్ సాంగ్ చేసి స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచింది. గంధపు చెక్కల స్మగ్లర్ నేపథ్యంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా గత ఏడాది డిసెంబర్ 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇక తెలుగుతోపాటు అన్ని భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకొని అన్ని చోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ముఖ్యంగా హిందీలో ఈ సినిమా ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుని రికార్డు సాధించింది. 


బాలీవుడ్లోని అగ్రతారల అక్షయ్ కుమార్, జాన్వికపూర్, కరణ్ జోహార్, అర్జున్ కపూర్ తదితర ప్రముఖులు కూడా వీక్షించి తమ అభిప్రాయాలనుసోషల్ మీడియా వేదికగా పంచుకోవడమే కాకుండా అల్లు అర్జున్ పై  ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా మరో బాలీవుడ్ దిగ్గజం నటుడు ఆయన మిథున్ చక్రవర్తి పుష్ప సినిమాను వీక్షించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉందంటూ.. ఇకపై తన అభిమాన నటుడు అల్లు అర్జున్ కూడా ఒకరిని చెప్పుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.. అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా చూశాను. నాకు సినిమా బాగా నచ్చింది.


బన్నీ చాలా అద్భుతంగా నటించాడు. ఆ సినిమాలో అతని అభినయం చూశాక తన అభిమానిగా మారిపోయాను. ఈ సినిమా చూస్తున్నంత సేపు వందల 1980,90 లో నేను నటించిన చిత్రాలు గుర్తుకు వచ్చాయి. ఇకనుంచి అల్లు అర్జున్ నా అభిమాన నటులలో ఒకరు. నిజం చెప్పాలంటే పుష్ప సింగిల్ స్క్రీన్ ఫిలిం. అయితే ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బన్నీ హీరోయిజం ఈ సినిమాకి బాగా హెల్ప్ అయింది. అందుకే గత ఏడేళ్ల కాలంలో బాలీవుడ్ లో వంద కోట్ల వసూళ్లను కలెక్ట్ చేసిన సినిమాగా పుష్ప సరికొత్త రికార్డును అందుకుంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: