చరణ్ తో సినిమా తీయాలని ఉంది... భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్..!

frame చరణ్ తో సినిమా తీయాలని ఉంది... భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్..!

Pulgam Srinivas
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా పనులన్నీ ముగించుకున్నాడు, ఈ సినిమా మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కాబోతుంది.  ఆర్ఆర్ఆర్ సినిమా సెట్స్ పై ఉండగానే రామ్ చరణ్, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు,  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా కొంత భాగం పూర్తి అయ్యింది. ఈ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు, ఈ సినిమాను యు వి క్రియేషన్స్ సంస్థ నిర్మించబోతోంది,  ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా జరిగిపోయింది.

  ఇలా వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న రామ్ చరణ్ తో సినిమాను నిర్మించాలనే ఆలోచన ఉన్నట్టు భీమ్లా నాయక్ ప్రొడ్యూసర్ తాజాగా తెలియజేశాడు. అసలు విషయంలోకి వెళితే.. సితార బ్యానర్ వారు ప్రస్తుతం వరుస విజయాలతో, వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు, ఈ సంస్థ తాజా చిత్రం డిజే టిల్లు, ఈ సినిమా తర్వాత భీమ్లా నాయక్ సినిమా విడుదల కాబోతోంది. ఇది ఇలా ఉంటే తాజా ఇంటర్వ్యూలో సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ తో మూవీ చేయడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది, ఈ మూవీ రీమేక్ అయినప్పటికీ, ఎవరికీ కూడా అలా అనిపించదు, అంతగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మార్పులు చేశారు. మళ్లీ పవన్ తో మూవీ చేయాలని ఉంది, ఆ విషయం గురించి పవన్ తో మాట్లాడాలి అనుకుంటున్నాను. ఇక చరణ్ అంటే చాలా ఇష్టం, ఈ బ్యానర్ లో ఆయనతో మూవీ చేయాలి అని అనుకుంటున్నాను.   ఈ బ్యానర్ లో హీరోగా చరణ్ చేసే మూవీకి  త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారు అని సూర్యదేవర నాగవంశీ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: