టివి: ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ.. ఏం జరిగిందంటే..?

frame టివి: ప్రియుడికి బ్రేకప్ చెప్పిన బిగ్ బాస్ బ్యూటీ.. ఏం జరిగిందంటే..?

Divya
బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఎంతోమంది బుల్లితెర సెలబ్రిటీలు సోషల్ మీడియా యూజర్స్ భారీగానే పాపులారిటీ సంపాదించుకొని సినిమాలలో కూడా అవకాశాలు సంపాదించుకున్నారు. అలా బుల్లితెరపై మంచి గుర్తింపు సంపాదించుకున్న జంటలలో ప్రియాంక చౌదరి, అంకిత గుప్తా కూడా ఒకరు.. వీరు బిగ్బాస్ సీజన్ -16 లో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సీజన్ లో ప్రియాంక సెకండ్ రన్నర్ గా గెలిచిందట. ఆ రియాల్టీ షో తర్వాత వీరిద్దరూ ఎన్నో సీరియల్స్ లో కలిసి నటించడం జరిగింది.

దీంతో వీరిద్దరూ కలిసి డేటింగ్ లో ఉన్నట్లు పలు రకాల వార్తలు ఎక్కువగా వినిపించాయి. అయితే త్వరలోనే ఒక యూట్యూబ్ ఛానల్ ని కూడా వీరు మొదలు పెట్టబోతున్నారని.. ఒక షో కి కూడా జతగా చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ఇంతలోనే ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇలాంటి సమయంలోనే ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడంతో.. అటు ప్రియాంక, అంకిత్ మధ్య విభేదాలు మొదలయ్యాయని రిలేషన్ కు గుడ్ బై చెప్పబోతున్నారని రూమర్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకుంటారనే విధంగా వార్తలు వినిపిస్తున్న తవరణంలో ఇలాంటి రూమర్స్ రావడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

అయితే ఈ తాజా పరిణామాలు చూస్తూ ఉంటే వీరిద్దరూ బ్రేకప్ చెప్పినట్లుగా బాలీవుడ్ లో వినిపిస్తోంది. మరి ఈ విషయం పైన అధికారికంగా ఈ జంటలో ఎవరో ఒకరు స్పందిస్తారో లేదో చూడాలి మరి. కానీ వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో తమ ఫోటోలను మాత్రం తొలగించుకోలేదట ఇదంతా చూస్తూ ఉంటే రాబోయే ఒక కొత్త షో కోసమే ఇలా ట్రై చేస్తున్నారని కొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అంకిత్ గుప్తా, ప్రియాంక ఇద్దరు బాలిక వధు, సద్దాహక్ వంటి సీరియల్స్ లో జంటగా కనిపించారు. అయితే ప్రియాంక చౌదరి ఇటీవలే శ్రీ విష్ణు నటిస్తున్న ఒక చిత్రంలో హీరోయిన్ గా కూడా నటించబోతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: