నువ్వో పాకిస్థాన్ బిచ్చగత్తేవి అంటూ మహిరా ఖాన్ పై మండిపడిన నెటిజెన్...!!

murali krishna
ఈ మధ్య సోషల్ మీడియాలో అయితే నెటిజన్ల ట్రోల్స్ కు హద్దు అదుపు లేకుండా పోతుందిగా.నోటికి ఏంత మాట వస్తే అంత అనేస్తున్నారట.దాంతో సెలబ్రెటీలు కూడా అదే స్థాయిలో సమాధానం చెపుతున్నారట..

సోషల్‌ మీడియా వచ్చాక సెలబ్రిటీల పై ట్రోలింగ్ కూడా బాగా విపరీతంగా పెరిగిపోయింది.ఇంతకు ముందు ఏమన్నా కానీ సెలబ్రెటీల మీద కోపం ఉన్నా.. ఏం చేయాలో తెలిసేది కాదు .. కాని ఇప్పుడు అరచేతిలో ప్రపంచం ఫోన్ లోనే కనిపిస్తుంది. నెట్ కూడా బాగా అందుబాటులో ఉంది.. సోసల్ మీడియా అకౌంట్లు కూడా ఉండటంతో ఇష్టంవచ్చినట్టు వారిని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇలానే గట్టిగా ట్రోల్స్ ఫేస్ చేసిందట పాకీస్తాని నటి.. బాలీవుడ్ బ్యూటీ మహిరా ఖాన్.

 
ఇక సెలబ్రెటీలు వేసుకున్న డ్రెస్‌ నచ్చకపోయినా అలాగే సినిమాలు నచ్చకపోయినా.. వారి వ్యవహారశైలి నచ్చకపోయినా కానీ గట్టిగా ట్రోల్ చేసి వదులుతున్నారు. దాంతో ఈ తలనొప్పిని భరించలేక చాలామందిస్టార్స్ కామ్ గా ఉంటున్నారట.. కాని మరికొంత మంది హైపర్ యాక్టర్స్ అయితే మాత్రం కామెంట్లకు రివర్స్ కౌంటర్లు ఇస్తున్నారు. చాలా మంది స్టార్స్ ఈ ట్రోలింగ్‌ను చూసీచూడనట్లు వదిలేస్తారు కానీ కొందరు మాత్రం ఘాటుగానే రియాక్ట్‌ అవుతున్నారు.. తాజాగా పాకిస్తాన్‌ నటి మహీరా ఖాన్‌ను ఓ నెటిజన్‌ తీవ్రంగా విమర్శించాడట.

 
ఓ సందర్భంలో నువ్వు పాకిస్తానీ బిచ్చగత్తెవి అని ముందు నీ దేశం మీద ఫోకస్‌ పెట్టు అని ఓ నెటిజన్ కామెంట్‌ చేశాడట.. ఇది చూసిన మహీరా.. నువ్వేంటి మరి నా మీద దృష్టి పెడుతున్నావ్‌ అని కౌంటరిచ్చి అతడి నోరు మూయించిందట.. తర్వాత ఈ పోస్ట్ ను కూడా డిలీట్ చేశారు. కాని ముందుగానే తీసుకున్న స్క్రీన్‌షాట్లు నెట్టింట మాత్రం ప్రత్యక్షమయ్యాయి

 
ఇక మరో నెటిజన్‌ మహీరాగారు ప్లీజ్‌ ఒక్కసారి మీకు ప్రపోజ్‌ చేయవచ్చా అని అడిగగా. దీనికి ఆ హీరోయిన్ స్పందిస్తూ ఎవరు వద్దంటున్నారు, చేసేయ్‌ అని బదులిచ్చిందట.. పాజిటీవ్ గా స్పందించే ఫ్యాన్స్ కు ఆమె ఓపిగ్గ సమాధానం చెపుతుంటుంది మహీరా. తనను కదిలించి కావాలని రెచ్చగొడితే మాత్రం ఇలానే నోరుమూయిస్తాను అంటోందట.

ఇక ఈపాకిస్తానీ హీరోయిన్ మహీరా 2017లో రయూస్‌ సినిమాలో షారుక్‌ ఖాన్‌ సరసన నటించిన విషయం తెలిసిందే . ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల.. భారత్‌లో పాకిస్తాన్‌ నటులపై నిషేధం విధించడంతో ఆమె పాకిస్తాన్ కే పరిమితం అయ్యిందట . ఇక్కడ మరే సినిమాలో ఆమె నటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: