మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ గురించి మీకు తెలుసా..??

N.ANJI
తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్ లో బిజీగా రాణిస్తున్నారు. పరశురాం ఈ సినిమాకి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ నటిస్తున్నారు. అయితే సాధారణంగా సినిమాలో హీరోకి చిన్నప్పటి పాత్ర చూపించినట్లు అయితే కుమారులు లేదా వారి బంధువుల పిల్లలు మాత్రమే ఆ పాత్రలలో నటిస్తూ ఉంటారు. ఆ తరుణంలోనే ప్రముఖ హీరో సుధీర్ బాబు తనయుడు చరిత్ మహేష్ బాబు సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్నారు. కాగా.. ఈ మూవీలో మహేష్ బాబు చిన్నప్పటి పాత్రలో సుధీర్ బాబు కొడుకు చరిత్ కనిపించనున్నట్లు సమాచారం.

అయితే సర్కారీ వారి పాట సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో సుధీర్ బాబు కొడుకు కనిపించనున్నారు. ఇక సుధీర్ బాబు కొడుకు చరిత్ చూడడానికి చాలా క్యూట్ గా అనిపించడంతో పాటు చాలా స్మార్ట్ గా.. టాలెంటెడ్ కూడా అని తెలుస్తుంది. కాగా ఈ సినిమా తరువాత ఈ పిల్లవాడు మరింత బిజీ ఆర్టిస్ట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయని సినీ ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. గతంలో మహేష్ బాబు నెంబర్ వన్ నేనొక్కడినే అనే సినిమా ద్వారా మహేష్ బాబు కొడుకు గౌతమ్ సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెల్సిందే.

వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ బాబు చిన్ననాటి పాత్రలో గౌతమ్ నటించి ప్రశంసలు అందుకున్నారు. ఇక ఇప్పుడు ఈ సినిమాలో మహేష్ చిన్ననాటి పాత్రలో చరిత్ నటించి ఏ మేర ప్రశంసలు అందుకుంటారో చూడాలి మరి. అయితే  ఈ మధ్యకాలంలో ఒక విషయం గమనించినట్లయితే మహేష్ బాబు కొత్త వాళ్లకు తన సినిమాల్లో అవకాశాలు ఎక్కువగా ఇస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు కొడుకు చరిత్రకు చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇచ్చినప్పటికీ ఇందులో సకెస్స్ అందుకుంటే రాధా సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: