షాక్: షూటింగ్లో మరొకసారి గాయాలపాలైన విశాల్..!!

Divya
అటు తమిళ ఇండస్ట్రీలో, ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ గా హీరో విశాల్ కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అనే దానికి సందేహం లేదు. ఎప్పుడు ఎక్కువగా మాస్ సినిమాలనే లైక్ చేస్తూ ఉంటాడు ఈ హీరో. అయితే విశాల్ నటించిన గత కొన్ని సినిమాలు మాత్రం వరుస డిజాస్టర్ గా మిగులు తూనే ఉన్నాయి. ప్రస్తుతం హీరో విశాల్ ఏ. వినోద్ కుమార్ డైరెక్షన్లో లాఠీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.. అయితే ఈ షూటింగ్ సమయంలో విశాల్ మరొకసారి గాయాలపాలైనట్లు తెలుస్తోంది.. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

లాఠీ సినిమాకు సంబంధించి ఒక సీన్ షూటింగ్ లో విశాల్ గాయపడటంతో అందుకు సంబంధించిన ఒక వీడియోని చిత్ర బృందం షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ వీడియో తెగ వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమాకి స్టాండ్ డైరెక్టర్ పీటర్ హెయిన్ కొరియోగ్రాఫర్ చేస్తున్నారు. ఇకపోతే ఈ గాయాల నుంచి విశాల్ తేరుకోవడానికి సుమారుగా మూడు వారాలపాటు సమయం పడుతుందని ఆయన చికిత్స తీసుకోవడానికి కేరళ కు బయలుదేరుతున్నారు అని , ఇక అక్కడే మూడు వారాల పాటు చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకో పోతున్నట్లు సమాచారం.

 ఇక మార్చి మొదటి వారం నుంచి లాఠీ యొక్క చివరి షెడ్యూల్ తిరిగి స్టార్ట్ చేస్తామని తెలియజేశారు. ఇకపోతే పీటర్ హెయిన్ యాక్షన్ సీన్ కోసం స్టంట్ టీమ్ కి  అప్డేట్లు ఇస్తున్నట్లు కూడా తెలియజేశారు.. ఇక విశాల్ కోలుకొని తిరిగి వచ్చిన తరువాత హీరోయిన్ తో ఉండే సన్నివేశాలను కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు.. ఇకపోతే విశాల్ ఇదివరకే వీరమే వాగై సూదుం సినిమా షూటింగ్ సమయంలో గాయాలపాలైన విషయం తెలిసిందే అయితే ఈసారి మళ్లీ గాయాలు పాలవడంతో ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు కూడా చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: