రామ్ చరణ్ పై బాలీవుడ్ హీరో పొగడ్తల వర్షం..

Purushottham Vinay
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ .. టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రామ్ చరణ్ ఓ మృగం ఇంకా ఓ పరిపూర్ణమైన యంత్రం అంటూ రణ్ వీర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.ఇక పూర్తి వివరాల్లోకి వెళితే.. `బాహుబలి` సినిమా తరువాత టాలీవుడ్ స్టార్స్ కి దేశ వ్యాప్తంగా క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. `ఆర్ ఆర్ ఆర్` సినిమా ప్రయోషన్స్ తో ఆ క్రేజ్ ఇప్పుడు మరీ తారా స్థాయికి చేరిపోయింది. దీంతో బాలీవుడ్ స్టార్ లు కూడా మన స్టార్స్ గురించి మాట్లాడటం మొదలుపెట్టారు.అందరిలాగే బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ కూడా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ పై షాకింగ్ కామెంట్స్ చేయడం వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో రణ్ వీర్ సింగ్ అభిమానులతో చిట్ చాట్ ని నిర్వహించారు.


ఇందులో ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అడిగిన ప్రశ్నకు రణ్ వీర్ సింగ్ చెప్పిన సమాధానాలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో రామ్ చరణ్ క్రేజ్ బాలీవుడ్ లోనూ పతాక స్థాయికి చేరిందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన రణ్ వీర్ సింగ్ ఈ సందర్భంగా టాలీవుడ్ హీరోల్లో తనకు అత్యంత ఫేవరేట్ యాక్టర్ ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అని చెప్పేశారు. అంతే కాకుండా రామ్ చరణ్ గురించి చెప్పమంటే `అతనొక మృగం ఇంకా ఓ పరిపూర్ణమైన మిషీన్` అంటూ షాకిచ్చాడు. `మగధీర` సినిమా చూపినప్పటి నుంచే రామ్ చరణ్ ని అభిమానిస్తున్నానని `ఆర్ ఆర్ ఆర్` సినిమా విడుదల కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాని రన్వీర్ సింగ్ అన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: