మరో క్రేజీ సినిమాలో ఆఫర్ దక్కించుకున్న రష్మిక మందన..?

Pulgam Srinivas
ప్రస్తుతం రష్మిక మందన సినిమాల స్పీడ్ మామూలుగా లేదు, ఛలో సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది.  ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో  విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర రష్మిక మందన అందుకుంది,  ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని రష్మిక మందన బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇలా వరుస విజయాలతో అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయిన రష్మిక మందన కొన్ని రోజుల క్రితం విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకుంది,  ఇలా పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో పాన్ ఇండియా రేంజ్ లో రష్మిక మందన క్రేజ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.


పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను పెంచుకున్న ఈ ముద్దుగుమ్మకు క్రేజీ సినిమా ఆఫర్ లు వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి, అందులో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కబోతున్న సినిమాలో ఈ ముద్దుగుమ్మను ఒక ముఖ్య పాత్ర కోసం చిత్ర బృందం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి,  అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో కూడా రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.  ఈ రెండు సినిమాలతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా తెరకెక్కబోతున్న సినిమాలో కూడా  రష్మిక మందన ను హీరోయిన్ గా తీసుకోవాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: