ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరియు కన్నడ భామ అయిన రష్మిక మందాన్న నటించిన 'పుష్ప: ది రైజ్' సినిమా బిగ్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే.
దాంతో దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం పుష్ప మేనియానే నడుస్తోందట.ఎవరిని కదిలించినా కానీ పుష్ప సినిమాలోని 'శ్రీవల్లి' మరియు 'ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా' పాటలు పాడడం అలాగే టిక్‌టాక్ వీడియోలు, ఇన్‌స్టా రీల్స్ రూపొందిస్తున్నారట.ముఖ్యంగా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 'శ్రీవల్లి' పాటలోని హుక్ స్టెప్ అయితే జనాలు తెగ ఫిదా అయిపోయారు.
'శ్రీవల్లి' పాటలో అల్లు అర్జున్ వేసిన హుక్ స్టెప్ మన దేశంలోనే కాదట ప్రపంచవ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిందని తెలుస్తుంది.. 'శ్రీవల్లి' ఫీవర్ తాజాగా కొరియాకు కూడా పాకిందట.. ఆన్‌లైన్‌లో ట్రెండింగ్‌లో ఉన్న శ్రీవల్లి పాటకు ఓ కొరియన్ మహిళ అద్భుతంగా డ్యాన్స్ చేసిందని సమాచారం.. అల్లు అర్జున్ లాగానే దుస్తులు ధరించి హిందీ పాటకు హుక్ స్టెప్ వేసిందట ఆమె . వెనకాల టీవీలో వీడియో సాంగ్ ప్లే అవుతుంటే కొరియన్ మహిళ హుక్ స్టెప్‌ను అచ్చు దింపేసిందిగా మరి.నిజం చెప్పాలంటే ఐకాన్ స్టార్‌కు ఏమాత్రం కూడా తీసిపోలేదు. ఎందరో రిక్రియేషన్ చేసినా కానీ ఇది బెస్ట్ అని చెప్పక తప్పదు.
కొరియన్ మహిళ డాన్స్ చేసిన వీడియోను 'కొరియన్ G1' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారట.. 'ఈ డాన్స్ మీరు అనుకున్నదానికంటే చాలా కష్టం అని కొరియన్ వెర్షన్‌లో అల్లు అర్జున్' అని క్యాప్షన్ పెట్టారట.వారం క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట బాగా వైరల్ అయింది. ఇప్పటికే ఈ వీడియోకి 2 లక్షలకు పైగా లైక్స్ మరియు 1.1 మిలియన్ల వ్యూస్ కూడా వచ్చాయి. 'హుక్ స్టెప్‌ను అల్లు అర్జున్ కంటే బాగా వేసిందిగా', 'అల్లు అర్జున్ హుక్ స్టెప్‌ను అచ్చు దించేసిందిగా', 'సూపర్ డాన్స్', 'లేడీ ఐకాన్ స్టార్' అంటూ ఫాన్స్ మాత్రం తెగ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.